యుద్ధవీరుడి సినిమాలో రానా..!

| Edited By:

Mar 20, 2019 | 2:59 PM

భల్లాలదేవుడు రానా మరో హిందీ మూవీలో నటించనున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ విజయ్ కర్ణిక్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘భుజు ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, విజయ్ పాత్రలో కనిపించనున్నాడు. అభిషేక్ దుదియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. వీరిద్దరితో పాటు సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, పరిణితీ చోప్రా, అమ్మీ విర్క్ ఈ […]

యుద్ధవీరుడి సినిమాలో రానా..!
Follow us on

భల్లాలదేవుడు రానా మరో హిందీ మూవీలో నటించనున్నాడు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ విజయ్ కర్ణిక్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ‘భుజు ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, విజయ్ పాత్రలో కనిపించనున్నాడు.

అభిషేక్ దుదియా దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. వీరిద్దరితో పాటు సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, పరిణితీ చోప్రా, అమ్మీ విర్క్ ఈ మూవీలో ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. 1971సంవత్సరంలో ఇండియా- పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. భూషణ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.