దివంగత నటి, మాజీ ముఖ్యమంత్రి, డైనమిక్ లేడీ జయలలిత జీవిత కథ ఆధారంగా పలు బయోపిక్స్ రెడీ అవుతున్నాయి. వాటితో పాటుగానే అటు వెబ్‌సిరీస్‌లు కూడా రూపొందుతున్నాయి. ముఖ్యంగా ఏ.ఎల్.విజయ్ ‘తలైవి’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ పురుచ్చితలైవి జయలలితగా నటిస్తోంది. మరోవైపు నిత్యామీనన్ కీలక పాత్రలో “ది ఐరన్ లేడీ’ పేరుతో మహిళా దర్శకురాలు ప్రియదర్శి ఓ సినిమా చేస్తోంది. ఈ రెండింటికీ పోటీగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ జయలలిత జీవిత నేపథ్యంలో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇందులో ప్రధాన ప్రాతలో రమ్యకృష్ణ నటిస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల టీజర్ విడుదల చేశారు.
ఇందులో జయలలిత బాల్యం నుంచి అంటే చదువుకునే రోజుల నుంచి రాజకీయ నేతగా ఎదిగిన తీరుని ఈ ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ లో రమ్యకృష్ణ తనదైన మార్క్ ఆహార్యంతో మెరిపించారు. విద్యార్థినిగా మరో యువనటిని.. నటిగా మరో తారను.. చివరికి రాజకీయ నేతగా మారిన జయ పాత్రలో రమ్యకృష్ణను ఇలా వివిధ రూపాల్లో దర్శకుడు చూపించే ప్రయత్నం చేశారు. గౌతమ్ మీనన్ తనదైన శైలిలో క్లాస్సీగా ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ మ్యాక్స్ ప్లేయర్ లో ప్లే కానున్నాయి. ఇక అమ్మగా నీలాంబరిని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి మరీ !
State Topper. Superstar Heroine. Youngest Chief Minister.
A gripping story of the QUEEN awaits you! #QueenIsComing@meramyakrishnan @menongautham @Murugesanprasad#Queen #MXOriginalSeries #MXPlayer #Ace2Three #FanFight pic.twitter.com/w8km3L2dWu— MX Player (@MXPlayer) December 1, 2019