
ఒకప్పుడు దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 300 కు పైగా సినిమాల్లో నటించింది. తన అందంతో అప్పటి కుర్రకారును కట్టిపడేసింది. అలా యంగ్ ఏజ్ లో రమ్యకృష్ణ అందానికి పడిపోయిన వారిలో హీరోలు కూడా ఉన్నారట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. బాహుబలిలో శివగామి పాత్రతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న రమ్య కృష్ణ ఇప్పుడు సహాయక నటిగానూ మెప్పిస్తోంది. పవర్ ఫుల్ పాత్రలతో ఆడియెన్స్ ను అలరిస్తోంది. హీరో హీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపిస్తోంది. సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఆమె తాజాగా జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరిస్తోన్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు అతిథిగా వెళ్లింది. ఈ సందర్భంగా జగ్గు భాయ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. అలాగే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ టాక్ షోలో భాగంగా జగపతి బాబు రమ్య కృష్ణకు ఒక ప్రశ్న అడిగారు.. ‘నీకు చిన్నప్పట్నుంచి చాలా మంది సైట్ కొట్టడం, ప్రేమించడం, పడి దొర్లడం.. అని చెబుతుండగానే .. ‘ఇన్‌క్లూడింగ్ యూ(నువ్వు కూడా)` అంటూ జగ్గు బాయ్ ముఖం మీదనే చెప్పేసింది (నవ్వుతూ). దీనికి జగపతి బాబు కూడా స్మైలింగ్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమోలు నెట్టింట వైరలవుతున్నాయి.
జగపతిబాబు, రమ్యకృష్ణ కలిసి పలు సినిమాల్లో నటించారు. ఆయనకు ఇద్దరు, బడ్జెట్ పద్మనాభం తదితర చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా, సహాయక నటుడిగా రాణిస్తున్నారు. అలాగే టీవీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక రమ్యకృష్ణ కూడా సహాయక నటిగా మెప్పిస్తోంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తోంది. ఇక జగపతి బాబు, రమ్యకృష్ణల ముచ్చట్లకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఈ ఆదివారం రాత్రి జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కానుంది.
From iconic roles to iconic conversations…Witness the evergreen charm of Ramya Krishna 🌸 filled with fun, nostalgia & timeless elegance 💫😍
Watch #JayammuNischayammuRaa on This Sunday at 8:30PM On #ZeeTelugu & the Premieres On This Friday On #Zee5… pic.twitter.com/dIDzVTtDg7
— ZEE TELUGU (@ZeeTVTelugu) October 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..