RGV New Movie: రామ్ గోపాల్ వర్మ… సంచలనాలకు మారుపేరు ఈ పేరు. రాము ఎక్కడ ఉంటే అక్కడ ఎప్పుడూ ఓ కాంట్రవర్సీ చక్కర్లు కొడుతుంటుంది. ఎప్పుడు ఏదో ఒక అంశంపై తనదైన రీతిలో స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు వర్మ. తన సినిమాకు పబ్లిసిటీని సరికొత్తగా సంపాదించుకుంటూ ఫ్రీగా పబ్లిసిటీని పొందుతుంటారు. ఇక వర్మ తీసే సినిమాలు కూడా ఆయన మాటల్లాగే సంచలనాలను మారు పేరుగా ఉంటాయి. సమాజాంలో జరిగే నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. ఈ క్రమంలోనే రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన కథాంశాలను తీసుకొని సినిమాలు తీస్తుంటారు వర్మ.
తెలుగు రాజకీయాల నేపథ్యంలో వర్మ ఇప్పటి వరకు.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’, ‘రక్త చరిత్ర’, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘వంగవీటి’, ‘పవర్ స్టార్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఇవి తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన అలజడి మాములుది కాదు. ఇదిలా ఉంటే తాజాగా వర్మ మరో సంచలనంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ.. ప్రస్తుతం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కథాంశంగా తీసుకొని ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘జగమొండి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందా.. ? ఒక వేళ షూటింగ్ ప్రారంభమైతే.. ఇందులో జగన్‌ను పాజిటివ్‌గా చూపిస్తారా.? ఏమైనా నెగిటివ్ అంశాలను టచ్ చేస్తారా.? లాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం రావాలంటే వర్మ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే.
ప్రకృతి ఈ జీవికి అందంతో పాటు ‘అమరత్వం’ ఇచ్చింది.. కానీ మరో పెద్ద లోపం కూడా దానికి ఉంది…
Rebel Star Prabhas: ఆదిపురుష్ సినిమా పై వస్తున్న ఆవార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..