
బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక రామాయణం పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా పోస్టర్ విడుదల కావడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీతారాములుగా రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి కనిపించి కనిపించి ఆకట్టుకోనున్నారు. తాజాగా రామాయణం సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను గణేశ్ చతుర్థి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించారు. నదీ తీరంలో సీతారాములు ఆప్యాయంగా గడుపుతున్న అందమైన క్షణాన్ని ఈ పోస్టర్‌లో చూపించారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో యశ్ రావణుడిగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రలో, రవి దూబే లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ పాటలను సమకూరుస్తుండగా, హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ‘జై జై రామ్’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటను అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.
ఇక ‘రామాయణం’ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగం 2026 దీపావళి సందర్భంగా నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అలాగే రెండో భాగం 2027లో విడుదల చేయాలని ప్రకటించారు. ఈ సినిమాలో శ్రీరాముడి జీవితం, సీతాదేవితో ఆయన వివాహం, వనవాసం, రావణుడితో జరిగే సంఘర్షణ వంటి రామాయణంలోని ప్రధాన ఘట్టాలను భారీ స్థాయిలో చూపించేలా రూపొందిస్తున్నారు మేకర్స్.
Celebrating the timeless bond of Siya Ram. 🕉️ pic.twitter.com/4LfRKV5RNe
— The World Of Ramayana (@WorldOfRamayana) September 14, 2026