Aakash Puri’s Chor Bazaar: రామ్ పోతినేని వదిలిన ‘చోర్ బజార్’ టైటిల్ సాంగ్.. దొంగగా ఆకాష్ పూరి

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Aakash Puris Chor Bazaar: రామ్ పోతినేని వదిలిన చోర్ బజార్ టైటిల్ సాంగ్.. దొంగగా ఆకాష్ పూరి
Akash Puri

Updated on: Feb 18, 2022 | 3:00 PM

Aakash Puri’s Chor Bazaar: డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆకాష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అయ్యాడు ఈ కుర్రహీరో. రొమాంటిక్ సినిమాలో మాస్ యాక్షన్ తో అదరగొట్టిన ఆకాష్ ఇప్పుడు మరోసారి అలాంటి కంటెంట్ తోనే రాబోతున్నాడు.  ‘చోర్ బజార్’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘జార్జ్ రెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాశ్ పూరి సరసన గెహ్నా సిప్పీ నటిస్తోంది. తాజాగా ఈ సినిమానుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటను ఎనర్జిటిక్ స్టార్ రామ్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను రామ్ సోషల్ మీడియాలో వదిలాడు. సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. శృతి రంజని ఆలపించిన ఈ పాటకు అసురా, సెల్విన్ లిరిక్స్, ర్యాప్ సమకూర్చారు. ఈ సినిమాలో ఆకాష్ పూరి దొంగగా కనిపించనున్నాడు. కార్ల టైర్ల నుంచి బైక్ పార్టుల వరకు ప్రతిదీ ఎత్తేస్తూ చోర్ బజార్‌లో అమ్మేయడం ఈ గ్యాంగ్ పని. పాతబస్తీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆకాష్ పూరి మరో విజయాన్ని అందుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: బోసి నవ్వులు.. చక్కనైన చెక్కిళ్లు.. ఈ క్యూట్ బుజ్జాయి ఎవరో చెప్పండి? అబ్బాయిల డ్రీమ్ గర్ల్!

Son Of India Review: చెడును స‌హించ‌ని స‌న్నాఫ్ ఇండియా.. తగ్గని డైలాగ్ కింగ్ ఎనర్జీ..

Anupama Parameswaran: అందాల ముద్దుగుమ్మ సీతాకోక చిలుకగా మారితే.. ఆకట్టుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ న్యూలుక్..