Ram Pothineni: సినిమా స్లోగా పిక్‌అప్ అవుతుంది.. నమ్మకంతో ఉన్నానన్న రామ్ పోతినేని

రామ్‌ పోతినేని హీరోగా మహేష్‌ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన సినిమా ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. పోయిన శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారందరూ బాగుందని రివ్యూ చెప్పారు కూడా. టాక్‌తోపాటు రివ్యూలు, రేటింగ్‌లు కూడా బాగానే వచ్చాయి.

Ram Pothineni: సినిమా స్లోగా పిక్‌అప్ అవుతుంది.. నమ్మకంతో ఉన్నానన్న రామ్ పోతినేని
Ram Pothineni

Updated on: Dec 03, 2025 | 4:00 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.

థాంక్ యూ మీట్ హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ.. రివ్యూవర్స్ కి థాంక్స్ చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సినిమా మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ సినిమా. ఎక్కువ మంది జనాలు చూడాలనే మైండ్ సెట్ తోనే తీసాం. కొన్ని పరిస్థితుల వల్ల నవంబర్ ఎండ్ లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే మాకు ఆడియన్స్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఎప్పుడు చేయనంతగా సినిమాని ప్రమోట్ చేశాం. ఎందుకంటే నాకు అంత పర్సనల్ కలెక్షన్ ఉంది, ఇప్పటివరకు చాలా ఎమోషన్స్ చూసాం. కానీ స్టార్ అండ్ ఫ్యాన్ కు మధ్య ఉన్న ఎమోషన్ చెబుతూ, హ్యూమన్ ఎమోషన్ కూడా టచ్ చేసిన సినిమా ఇది. ఇలాంటి ఎమోషన్ ప్రపంచంలో ఎక్కడా లేదు. మన తెలుగు సినిమాకే సొంతం. ఒక సినిమా చేస్తున్నప్పుడు హిట్టా ఫ్లాపా అనేది అనే భయమేస్తుంది. కానీ ఈ సినిమా చేసినప్పుడు మాత్రం ఇది మంచి సినిమా అని వెంటనే తెలుసుకుంటారా కొంచెం లేటుగా తెలుసుకుంటారా అనేది చూడాలని అనిపించింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా మొదటి రోజే కొట్టేయాలనే ప్లానింగ్ లో లేము. ఫస్ట్ వీక్ స్లోగా ఉంటుంది, నెమ్మది నెమ్మదిగా పిక్ అప్ అవుతుందని నమ్మకంతో తీసిన సినిమా. ఈ సినిమాని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆడియన్స్ నుంచే రెస్పాన్స్ వస్తుంది.

టిఎఫ్ఐ ఫెయిల్ అయ్యిందనే మాట కూడా వినిపిస్తుంది. కానీ నేను నమ్మేదేంటంటే టిఎఫ్ఐ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వదు. మనం సినిమా లవర్స్ మంచి సినిమాకి గుర్తింపు వస్తూనే ఉంటుంది. సినిమా పదిమంది చూస్తే 9 మందికి నచ్చింది. అన్ సీజన్ వల్ల పదిమంది చూశారు. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది అని నమ్ముతున్నా. 100 మంది చూస్తే 90మందికి నచ్చుతుందని నమ్మకంతో ఉన్నాం. నవంబర్ అయిపోయింది. ఎక్కువ మందికి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా ఉద్దేశం. మరింత మంది వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాం. ఒక హానెస్ట్ సినిమా తీయడానికి ధైర్యాన్ని ఇచ్చిన సినిమా ఇది. వివేక్ మర్విన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో అండర్ కరెంట్ గా అద్భుతమైన మెసేజ్ ఉంది మంచి స్ఫూర్తితో బయటికి వచ్చే కంటెంట్ ఉంది. పదిమందిలో తొమ్మిది మంది అది ఫీలయ్యారు. నాకు సినిమా గురించి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తూనే ఉంది. చాలా మెసేజ్లు వచ్చాయి మహేష్ హానెస్ట్ ఫిలిం మేకర్. తెలుగు సినిమాకి మహేష్ లాంటి ఫిలిం మేకర్స్ కావాలి. భాగ్యశ్రీ గ్లామర్ గా కనిపిస్తూనే అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తుంది. ప్రమోషన్స్ లో కూడా చాలా సపోర్ట్ చేసింది. ఆంధ్ర కింగ్ తాలూకా మనసుకు చాలా దగ్గరైన సినిమా. సెకండ్ వీక్ అద్భుతంగా ఉండబోతుంది. ఇంకా ఎక్కువ మంది సినిమా చూసి ఒక మంచి అనుభూతిని పొందుతారని నమ్మకం ఉంది. తెలుగు సినిమా లవర్స్ అందరు కూడా ఈ సినిమాకి వచ్చి ఈ ఎమోషన్ ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .