AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్‌కు కోమటిరెడ్డి కౌంటర్.. ముదురుతున్న వివాదం

పవన్‌కు కోమటిరెడ్డి కౌంటర్.. ముదురుతున్న వివాదం

Phani CH
|

Updated on: Dec 03, 2025 | 3:25 PM

Share

పవన్ కల్యాణ్ కోనసీమ దిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా వివిధ పార్టీల నాయకులు పవన్‌ను తప్పుబట్టారు. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడబోవని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు బీఆర్ఎస్, వైకాపా నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పవన్ దిష్టి వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు రియాక్ట్ అవుతూ పవన్ వ్యాఖ్యల్ని తప్పు పడుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడారంటూ ఫైరయ్యారు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదని, పవన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.పవన్ బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడవు అని తేల్చి చెప్పారు. ఇక నవంబర్ 26న కోనసీమ జిల్లాలో పర్యటించారు పవన్. కేశనపల్లిలో కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతినడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే కోనసీమకు దిష్టి తగిలిందని.. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా కారణమని అన్నారు.ఈ కామెంట్లకు వెంటనే BRS నుంచి రియాక్షన్ వచ్చింది. ఇటు.. YCP నేతలూ తప్పుపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: అఖండ-2 లో సీనియర్ ఎన్టీఆర్ ??

Samantha Wedding Ring: సమంత వెడ్డింగ్ రింగ్ కాస్ట్.. ఎన్ని కోట్లో తెలుసా ??

ఈ సంక్రాంతికి డబుల్ బొనాంజా.. అనిల్ రావిపూడి ధీమా

యాప్‌ల వినియోగంపై కేంద్రం కొత్త రూల్

Janhvi Kapoor: ‘నా తల్లి మరణంపై తప్పుడు ప్రచారం చేశారు’ జాన్వీకపూర్ ఎమోషనల్ !!