Ram Gopal Varma: అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..

|

Jan 04, 2022 | 10:28 AM

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి.. సినీ ప్రముఖులకు మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో టికెట్స్ రేట్స్ తగ్గించడంపై

Ram Gopal Varma: అధికారం ఇచ్చింది మా తలపై కూర్చోవడానికి కాదు.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
Ram Gopal Varma
Follow us on

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి.. సినీ ప్రముఖులకు మాటల యుద్ధం కొనసాగుతుంది. ఏపీలో టికెట్స్ రేట్స్ తగ్గించడంపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించాలని.. పెద్ద సినిమాలు దారుణంగా నష్టపోతాయంటూ ప్రొడ్యుసర్స్ వాపోతున్నారు. సినిమా టికెట్స్ ధరలను పెంచాలని కోరుతున్నారు. అయితే అటు ఏపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ప్రభుత్వానికి.. సినీ ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఈ ఇష్యూపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ప్రభుత్వ నిర్ణయం పై మండిపడ్డారు. ఏపీ సినిమాటోగ్రఫర్ మంత్రి పేర్ని నానికి.. రామ్ గోపాల్ వర్మకు మధ్య గత రెండు మూడ్రోజుల నుంచి మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో నిన్న టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు మరోసారి టికెట్ రేట్స్ ఇష్యూపై వర్మ ట్విట్టర్ ఖాతాలో వరుస ట్విట్స్ చేస్తున్నారు.

నిన్న టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. మంత్రి పేర్ని నాని, కొడాలి నాని వినాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశాడు. అంతేకాకుండా .. కాసేపటి నుంచి వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్స్ చేస్తూ పేర్ని నానికి సవాలు విసురుతున్నారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోరుతున్నారు. సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏమిటి సార్ ? అంటూ వర్మ ప్రశ్నించారు.

మీ ప్రభుత్వానికి అట్టడుగు స్థాయి నుండి మద్దతు ఇచ్చే అధికారం ఇచ్చారని, మా తలపై కూర్చోవడానికి కాదని మీరు అర్థం చేసుకోవలసిందిగా కోరుతున్నాను ..చాలా ధన్యవాదాలు అంటూ వర్మ కౌంటర్ వేసాడు..

ట్వీట్..

Also Read: Pushpa: నెట్టింట్లో బన్నీ మేనియా..  అమెజాన్ ప్రైమ్‏లో పుష్ప.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనంటూ.. 

Bellamkonda Srinivas: టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న హిందీ ఛత్రపతి.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..

Balakrishna: బాలకృష్ణ సినిమాలో విలన్‏గా కన్నడ హీరో.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..