Ram Charan: చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ రక్తదానం.. రౌడీ బాయ్‌కు చెర్రీ స్పెషల్‌ విషెస్‌

విజయ్‌ అభిమానులు చాలామంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు. తద్వారా తమ ఫేవరేట్ యాక్టర్ పుట్టినరోజును మరింత స్పెషల్ డేగా మార్చారు. దీంతో రౌడీ బాయ్‌ ఫ్యాన్స్‌ చాలామంచి పని చేశారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Ram Charan: చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ రక్తదానం.. రౌడీ బాయ్‌కు చెర్రీ స్పెషల్‌ విషెస్‌
Ram Charan, Vijay Devarakonda

Updated on: May 11, 2023 | 6:10 AM

టాలీవుడ్‌ రౌడీ బాయ్‌, హీరో విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అతనికి బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఇక తమ అభిమాన హీరో బర్త్‌డేను పురస్కరించుకుని చాలామంది అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా విజయ్‌ అభిమానులు చాలామంది చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి రక్తదానం చేశారు. తద్వారా తమ ఫేవరేట్ యాక్టర్ పుట్టినరోజును మరింత స్పెషల్ డేగా మార్చారు. దీంతో నెటిజన్లు రౌడీ బాయ్‌ ఫ్యాన్స్‌ చాలామంచి పని చేశారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ విజయ్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌’లో రక్తదానం చేసిన మీ అభిమానులను నిజంగా అభినందిస్తున్నాను’ అని చెర్రీ ట్వీట్ చేశారు. దీనికి విజయ్ దేవరకొండ కూడా రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ అన్న’ అని ట్వీట్‌ చేసిన రౌడీబాయ్‌… తన అభిమానులు ఎప్పుడూ తనను గర్వపడేలా, సంతోషంగా ఉండేలా చేస్తారన్నారు. తన అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ చేసిన కామెంట్లు.. వాళ్లు వింటే ఎంతో హ్యాపీగా ఫీలవుతారని ట్వీట్ లో పేర్కొన్నారు. మొత్తానికి రామ్ చరణ్‌, విజయ్‌ దేవరకొండల ట్వీట్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ అనే సినిమా చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే విజయ్‌ దేవరకొండ విషయానికొస్తే.. సమంతతో కలిసి ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రీలీలతో కలిసి ఇటీవలే కొత్త ప్రాజెక్టును కూడా స్టార్ట్‌ చేశాడు. ఇక తన పుట్టిన రోజు సందర్భంగా VD12 పేరుతో మరో మూవీని కూడా ప్రకటించాడు.

రామ్ చరణ్, విజయ్ ల ట్వీట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..