Ram Charan Next Movie Updates : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ మూవీ తీసిన మైత్రి మూవీ మేకర్స్ బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. కాగా అప్పుడే చెర్రీతో మరో మూవీ తీయడానికి కూడా అడ్వాన్స్ ఇచ్చేశారు ఈ బడా నిర్మాతలు. ఈ సారి చేసే సినిమా కూడా రంగస్థలం రేంజ్ లో ఉండాలని ఈ నిర్మాతలు వ్యూహరచన చేశారు. ఈ క్రమంలోనే తమిళ్‌లో ‘ఖైదీ’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న లోకేశ్ కనగరాజ్‌కు మైత్రి వాళ్లు అడ్వాన్స్ ఇచ్చారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లోకేశ్ తమిళ స్టార్ హీరో విజయ్‌తో ‘మాస్టర్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజైతే లోకేశ్ బడా దర్శకుల లిస్ట్‌లో చేరిపోతాడని ఫిల్మ్ ఇండస్ట్రీ అంచనా చేస్తోంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ ఇచ్చేసి అతడ్ని ముందుగా మైత్రి మూవీ మేకర్స్ లాక్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడనే విషయంపై చెర్రీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వెంకీ కుడుముల, వంశీ పైడిపల్లి కథలు ఓకే చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నా ఇంకా వాటిపై క్లారిటీ రాలేదు. దీంతో లోకేశ్ త్వరలోనే చరణ్‌ను డైరెక్ట్ చేయబోతున్నడానే టాక్ నడుస్తోంది.
Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్