Evaru Meelo Koteeswarulu: రామారావు గారు వస్తున్నారు.. మొదట రామ్ చరణ్‌‌ను తెస్తున్నారు.. అదిరిన కర్టెన్ రైజర్

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించేందుకు మరో క్రేజీ ప్రొగ్రామ్  సిద్ధమైంది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా 'ఎవరు మీలో కోటీశ్వరులు'...

Evaru Meelo Koteeswarulu: రామారావు గారు వస్తున్నారు.. మొదట రామ్ చరణ్‌‌ను తెస్తున్నారు.. అదిరిన కర్టెన్ రైజర్
Evaru Meelo Koteeswarulu

Updated on: Aug 15, 2021 | 7:32 PM

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించేందుకు మరో క్రేజీ ప్రొగ్రామ్  సిద్ధమైంది. ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ఆగస్టు 22 నుంచి ప్రసారం కానుంది. తొలి ఎపిసోడ్‌కు మెగా‌పవర్ స్టార్ రామ్‌చరణ్‌ విచ్చేసి సందడి చేశారు. ఎన్టీఆర్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా షేర్​ చేసి ”ఈనెల 22న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ద్వారా మీ ఇంటిలో సందడి చేయబోతున్నామని పేర్కొన్నారు. బ్రదర్ రామ్‌చరణ్‌తో కలిసి చేసిన ఈ కర్టెన్‌ రైజర్‌ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తున్నా” అని ట్వీట్‌ చేశారు.

ఎన్టీఆర్ ట్వీట్

ఇక షోలోకి చెరణ్  ఎంట్రీ ఇచ్చి, హోస్ట్‌సీట్‌లో కూర్చోబోయారు. వెంటనే అడ్డుపడిన ఎన్టీఆర్‌.. అది హాట్‌ సీటు‌.. ఇది హోస్ట్‌ సీటు అని చెప్పడం వల్ల చరణ్‌ వెళ్లి హాట్‌ సీటులో సెటిల్ అయ్యారు. అనంతరం ఇద్దరి మధ్య ఇంట్రస్టింగ్ కన్వర్జేషన్ నడిచింది. చివరకు ఎన్టీఆర్‌ వేసిన ప్రశ్న విన్న తర్వాత ‘సీటు హీట్‌ ఎక్కుతోంది.. బ్రెయిన్‌ హీట్‌ ఎక్కుతోంది’ అంటూ చరణ్‌ ఆన్సర్ ఇవ్వడం చూస్తుంటే ఈ ఎపిసోడ్‌ వీక్షకులకు ఫుల్ కిక్ ఇవ్వబోతుందని  అర్థమవుతోంది. పూర్తి ఎపిసోడ్‌ ఆగస్టు 22న రాత్రి 8.30 గంటలకు టెలికాస్ట్ అవ్వనుంది.  కాగా చరణ్, తారక్..  రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.