Game Changer: గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి.. ఆడియన్స్ ఏమంటున్నారు..?

|

Jan 10, 2025 | 9:41 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అంజలి మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యస్ .జె. సూర్య, సునీల్, శ్రీకాంత్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా గేమ్ ఛేంజర్ సినిమాను నిర్మించారు.

Game Changer: గేమ్ ఛేంజర్ పరిస్థితి ఏంటి.. ఆడియన్స్ ఏమంటున్నారు..?
Game Changer
Follow us on

దిల్ రాజు నాలుగేళ్ల బడ్జెట్.. రామ్ చరణ్ మూడేళ్ళ కష్టం.. శంకర్ మేకింగ్.. ఇలా ఎన్నో అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ సినిమా విడుదలైంది. నిజం చెప్పాలంటే ఇండియన్ 2 ఫ్లాప్ అయిన తర్వాత కాస్త తక్కువ అంచనాలతో వచ్చింది గేమ్ ఛేంజర్. మరి వాటిని ఈ సినిమా అందుకుందా లేదా అనే చర్చ అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్య ఏ పెద్ద సినిమా విడుదలైనా కూడా నెగిటివ్ టాక్‌తోనే ఓపెన్ అవ్వడం కామన్‌గా మారింది. అది దేవర అయినా.. కల్కి అయినా.. పుష్ప అయినా.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ అయినా.. సినిమా ఏదైనా కూడా టాక్ అయితే తేడాగానే వస్తుంది. ఆ తర్వాత అవే సినిమాలు కనకవర్షం కురిపిస్తున్నాయి. తాజాగా గేమ్ ఛేంజర్ విషయంలోనూ ఇదే జరుగుతుందని నమ్ముతున్నారు అభిమానులు. అయితే కొందరు ఇస్తున్న కంప్లైంట్ మాత్రం మరోలా ఉంది.

అది కూడా రామ్ చరణ్‌పై కాదు శంకర్‌పై..! మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి.. లేదని అక్కడే ఉండిపోతే కొన్నిసార్లు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు ఉంటుందంటున్నారు శంకర్ ఫ్యాన్స్. గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఇదే అంటున్నారు కూడా. ఒకప్పుడు శంకర్ సినిమా అంటే ఓ అద్భుతం అంతే.. అందులో మాటల్లేవు. మరీ ముఖ్యంగా పాటల కోసమే శంకర్ సినిమాలకు వెళ్లే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అయితే ట్రెండ్ ఫాలో అవ్వకుండా శంకర్ అక్కడే ఉండిపోయాడేమో అనిపిస్తుంది. రామ్ చరణ్ ప్రాణం పెట్టాడు.. నిర్మాత దిల్ రాజు వందల కోట్లు పెట్టాడు.. కానీ దర్శకుడు శంకర్ మాత్రం ఎందుకో అక్కడే ఆగిపోయాడు అనిపించిందంటున్నారు శంకర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్.

ఫస్టాఫ్ పర్లేదు.. కొన్ని మూమెంట్స్ ఉన్నాయి.. సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓకే అనిపిస్తుంది.. ఆ 20 నిమిషాలు అప్పన్న పాత్రలో అదరగొట్టాడు రామ్ చరణ్.. ఫ్లాష్ బ్యాక్ పూర్తయిన తర్వాత కథ ఎక్కడో గాడి తప్పినట్టు అనిపించిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. రామ్ చరణ్, ఎస్ జే సూర్య మధ్య వచ్చే టిట్ ఫర్ ట్యాట్ సీన్స్ బాగా పేలాయి. ఒక కలెక్టర్ తలుచుకుంటే ఏం చేస్తాడు.. అతనికి ఎన్ని పవర్స్ ఉన్నాయి అనేది మాత్రం చాలా బాగా చూపించాడు శంకర్. ముక్కలు ముక్కలుగా గేమ్ చేంజర్ అదిరిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. మొత్తం సినిమాగా చూసుకుంటే మాత్రం ఎక్కడో శంకర్ మార్క్ మిస్ అయిందంటున్నారు. అయితే సంక్రాంతి సీజన్ కావడంతో ఈ టాక్ ఏం పని చేయదని గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి