అన్‌స్టాపబుల్ సెట్‌లో రామ్ చరణ్ సందడి చేశారు. గేమ్ చేంజర్ ప్రమోషన్‌లో భాగంగా అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నారు చరణ్.. సంక్రాంతిలో బాలయ్య, చరణ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. డాకూ మహారాజ్‌గా వస్తున్న బాలయ్య. అలాగే గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు చరణ్. ఈ సందర్భంగా ఇద్దరి సినిమాలు ఘన విజయం సాధించాలని అన్నారు బాలయ్య. తాజాగా రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ షూటింగ్ కు హాజరయ్యారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో చరణ్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు.