
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే చెర్రీ చిన్ననాటి ఫోటోస్, వీడియోస్, రేర్ పిక్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాగే తమ అభిమాన హీరోకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 1985 మార్చి 27న జన్మించాడు చరణ్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పూర్తి చేశారు. అదే స్కూల్లో రానా దగ్గుబాటీ, శర్వానంద్ కూడా విద్యాభ్యాసం పూర్తి చేశారు. చరణ్ మొదట క్రికెటర్ కావాలనుకున్నాడట. అందుకు శిక్షణ కూడా తీసుకున్నారట. జర్మనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ చేయాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాకముందు చరణ్ ఏం చేసేవారు ?.. ఫస్ట్ జాబ్ ఏంటీ ?.. సాలరీ ఎంత అనే విషయాలు చాలా మందికి తెలియదు. కానీ ఈ విషయాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు చరణ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగ్గా.. చరణ్ తన ఫస్ట్ జాబ్ ఏంటో చెప్పేశారు. తన మొదటి జాబ్ ఇంట్లోనే చేశానని.. కానీ అందుకు తనకు ఎలాంటి జీతం ఇవ్వలేదని అన్నారు చరణ్. కానీ ఏం జాబ్ అనేది మాత్రం రివీల్ చేయలేదు. అలాగే ఇప్పటివరకు తాను నటించిన అందరి హీరోయిన్లలో కియారా అద్వానీ యాక్టింగ్ తనకు ఇష్టమని అన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో గ్యాంగ్ లీడర్ మూవీ ఎప్పటికీ తన ఫేవరెట్ అని అన్నారు. అలాగే తన సినిమాల్లో రంగస్థలం సినిమా ఇష్టమని అన్నారు చరణ్.
చిరుత సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు చరణ్. 2007లో సెప్టెంబర్ 28న ఫస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. కానీ ఫస్ట్ రోజే దాదాపు రూ. 4 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత చరణ్ నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. నటన రాదని.. హీరో కంటెంట్ కాదని క్రిటిక్స్ విమర్శించారు. ఆ తర్వాత జక్కన్న డైరెక్షన్లో చరణ్ నటించిన మగధీర మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ సినిమా తర్వాత ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ విలక్షణమైన నటనతో విమర్శించిన వారే పొగడ్తలు కురిపించేలా చేశాడు చరణ్. అవమానించినవారే శభాష్ అంటూ పొగిడేలా కసిగా నటించారు. గెలుపు.. ఓటమిలతో సంబంధం లేకుండా అద్భుతమైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ క్రేజ్ అందుకున్నాడు.
డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో అదరగొట్టాడు. ఈ మూవీలో చరణ్ నటనకు సినీ ప్రియులు ముగ్దులయ్యారు. ఇక రాజమౌళి తరెకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మరోసారి తన అద్భుతమైన నటనతో విమర్శకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.