Ram Charan : పుట్టబోయే బిడ్డగురించి మొదటిసారి స్పందించిన చరణ్.. ఏమన్నారంటే

|

Feb 24, 2023 | 6:51 AM

ప్రస్తుతం ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు అమెరికాలో అడుగు పెట్టిన చరణ్  ఓ ఇంటర్నేషనల్‌ న్యూస్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Ram Charan : పుట్టబోయే బిడ్డగురించి మొదటిసారి స్పందించిన చరణ్.. ఏమన్నారంటే
Ram Charan
Follow us on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు అమెరికాలో అడుగు పెట్టిన చరణ్  ఓ ఇంటర్నేషనల్‌ న్యూస్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో చరణ్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. పుట్టబోయే బిడ్డ డెలివరీపై తన మనసులోని భావాలను బయటపెట్టారు.

అమెరికాలో వన్‌ఆఫ్‌ది టాప్‌ గైనకాలజిస్ట్‌ అడిగిన ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్‌ ఇచ్చారు రామ్‌చరణ్‌. మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు, ఎలా ఫీలవుతున్నారంటూ అడగ్గా.. కొన్నాళ్లుగా ప్రయాణాలు, బ్యాగులు సర్దుకోవడంతోనే సరిపోతోందన్నారు. దాంతో రామ్‌చరణ్‌కు సూపర్‌ ఆఫర్‌ ఇచ్చారు ఆ గైనలాజిస్ట్‌. మీ ఫస్ట్‌ బేబీని నేను డెలివరీ చేస్తా, అది నాకు దక్కే గౌరవంగా భావిస్తానన్నారు. అంతేకాదు, నేను ఎనీటైమ్‌ అందుబాటులో ఉంటా, మీకోసం ప్రపంచమంతా పర్యటిస్తానంటూ చెప్పుకొచ్చారు. గైనకాలజిస్ట్‌ ఆఫర్‌కి థ్యాంక్స్‌ చెప్పిన రామ్‌చరణ్‌… కచ్చితంగా మీ ఫోన్‌ నెంబర్‌ తీసుకుంటానంటూ రిప్లై అచ్చారు. ఎలాగూ నా భార్య కొద్దిరోజులు అమెరికాలో ఉండేందుకు వస్తోందని చెప్పారు చెర్రీ

ఇక ట్రిపులార్‌ సినిమా సక్సెస్‌పైనా ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఇండియన్‌ స్పీల్‌ బర్గ్‌గా రాజమౌళిని అభివర్ణించారు రామ్‌చరణ్‌. 85ఏళ్ల భారతీయ సినీ చరిత్రలో ట్రిపులార్‌కి మాత్రమే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కిందన్నారు. ఇది ఇండియన్‌ సినిమాకు..ఇండియన్‌ టెక్నీషియన్స్‌కు దక్కిన గౌరవం అన్నారు చెర్రీ. అయితే, ఇది ఆరంభం మాత్రమే.. ముందుముందు మరిన్ని సంచలనాలు ఉంటాయన్నారు.