Ram Charan-Shankar: అతిరథమహారధులు మధ్య రామ్ చరణ్ శంకర్ మూవీ ప్రారంభోత్సవం.. వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి

|

Sep 09, 2021 | 8:32 PM

Ram Charan-Shankars RC 15 Launch Video: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని వరస సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా చెర్రీ, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది..

Ram Charan-Shankar: అతిరథమహారధులు మధ్య రామ్ చరణ్ శంకర్ మూవీ ప్రారంభోత్సవం..  వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి
Ram Charan
Follow us on

Ram Charan-Shankars RC 15 Launch Video: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని వరస సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా చెర్రీ, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. అతిరథమహారధుల మధ్య హైదరాబాద్ లో పూజా కార్యక్రమం జరుపుకున్న సంగతి తెలిసిందే.. అంతేకాదు.. సినిమా ప్రారంభోత్సవం రోజున హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కియారాలు, దర్శకుడు శంకర్‌, నిర్మాత దిల్‌ రాజు,  కీలక పాత్రలో నటించనున్న సునీల్‌ సహా ఇతర టెక్నీషియన్లు అందరూ సూటుబూటు వేసుకొని ఫైల్స్‌ పట్టుకొన్న ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.  సినిమాకు సంబంధించిన వారందరినీ పోస్టర్ఈ లో పెట్టి.. ఈ  క్రేజీ పోస్టర్‌కు వీ ఆర్‌ కమింగ్‌ అంటూ క్యాప్షన్‌ను జోడించి సినిమాపై మొదట్లోనే అంచానలు పెంచేలా చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శ్రీకాంత్,  సునీల్, అంజలి తదితరులు  చిత్రం ప్రారంభోత్సవంలో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో దిల్ రాజు అధికారికంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో మెగా అభిమానులను ఓ రేంజ్ లో అలరిస్తుంది.

రామ్ చరణ్ 15వ సినిమా ఇది.  ఈ మూవీ  పాన్ ఇండియా  స్థాయిలో భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.సహా నిర్మాతగా శిరీష్ వ్యవహరించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నారు. అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

 

Also Read:  జగన్ ప్రభుత్వానికి ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. భారీగా రెవెన్యూ లోటు భర్తీ నిధులు విడుదల

Khairatabad Ganesh: 1954 లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 1 అడుగు విగ్రహం.. దేశంలో ఎత్తైన గణేష్ విగ్రహంగా ఎలా మారిందంటే..