Peddi Movie: చికిరి అంటే అర్థం ఇదే.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన పెద్ది టీమ్.. సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతుంది.

Peddi Movie: చికిరి అంటే అర్థం ఇదే.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన పెద్ది టీమ్.. సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే..
Chikiri Song

Updated on: Nov 05, 2025 | 12:23 PM

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ గ్లింప్స్ ఆకట్టుకుంది. అలాగే ఇటీవల జాన్వీ కపూర్ రోల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. తాజాగా ఈరోజు (నవంబర్ 5న) ఈ సినిమా నుంచి చికిరి సాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ఈ పాటలో రామ్ చరణ్ హుక్ స్టెప్ అందరిని ఆకట్టుకుంటుంది.

చికిరి పాటను నవంబర్ 7న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా చికిరి అనే పదానికి అర్థం చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. రెహమాన్ మ్యూజిక్ స్టూడియోలో డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ది సినిమా గురించి డిస్కస్ చేస్తుంటారు. రెహమాన్ సూపర్ హిట్ సాంగ్స్ గురించి చెబుతూ.. ఈసారి పెద్ది నుంచి ఆట కాదు పాట రిలీజ్ చేయాలని అనుకుంటున్నానని అంటాడు. అప్పుడే పాట సిచ్యువేషన్ వివరిస్తాడు. పెద్దిలో హీరోయిన్ ను మొదటిసారి చూడగానే ఒక రకమైన ఫీలింగ్ కు గురవుతాడు హీరో. అప్పుడు ఫ్రెండ్ తో కాటుక అక్కర్లేని కళ్లు.. ముక్కు పుడక అక్కర్లేని ముక్కు..అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరా అని అంటాడని బుచ్చిబాబు చెప్తాడు.

చికిరి అంటే ఏంటీ ? అని రెహమాన్ అడిగితే.. వాళ్ల ఊర్లో అందమైన అమ్మాయిలను అలా ముద్దుగా పిలుస్తారని.. బుచ్చిబాబు చెప్పడంతో అయితే చికిరితోనే సాంగ్ చేద్దామంటారు రెహమాన్. ఆ వెంటనే బీడీ కాలుస్తూ రామ్ చరణ్ వేసే హుక్ స్టెప్ వస్తుంది. దీంతో ఇప్పుడు చికిరి పాట కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఈ పాటలో రామ్ చరణ్ వేసే హుక్ స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

Follow Us