Chikiri Song: ‘చికిరి’ స్టెప్పు వేస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. డాక్టర్ ఏం చెప్పారో మీరే చూడండి.. వీడియో

'చికిరి… చికిరి..' ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటే మార్మోగుతోంది. శుభకార్యాలు, పెళ్లి వేడుకలు, బరాత్ లు.. ఇలా సందర్భమేదైనా ఈ రామ్ చరణ్ పెద్ది సాంగ్ వినిపించాల్సిందే. ఇక సోషల్ మీడియా అకౌంట్స్ ను ఓపెన్ చేస్తే చికిరి సాంగ్ కు సంబంధించిన రీల్స్, వీడియోలే కనిపిస్తున్నాయి.

Chikiri Song: చికిరి స్టెప్పు వేస్తే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. డాక్టర్ ఏం చెప్పారో మీరే చూడండి.. వీడియో
Ram Charan Peddi Chikiri Song

Updated on: Dec 03, 2025 | 6:21 PM

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి, సత్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజైన చికిరి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ మార్క్(10 కోట్ల‌) ను దాటేసింది. ఈ క్రమంలో చాలా మంది చికిరి సాంగ్ కు రీల్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ లాగే ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు, విదేశీయులు కూడా ఈ పాటకు స్టెప్పులు వేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సాంగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యింద.

ఇదిలా ఉంటే పెద్ది చికిరి సాంగ్ కేవలం సరదా కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు డాక్టర్. ఈ స్టెప్పు సరిగా వేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఓ వైద్యురాలు చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. ‘ప్రతి ఒక్కరు కూడా ఈ చికిరి స్టెప్పును చూశారు కదా.. ఇది చాలా బాగుంటుంది కదా.. ఈమధ్య కాలం లో ఎక్కడ చూసినా ప్రతీ ఒక్కరు చికిరి పాటకు స్టెప్పులేస్తున్నారు. ఈ స్టెప్పులను సరిగా వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా శరీరంలో రక్త ప్రసరణ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో కూడా ఉంటాయి’ అని డాక్టరమ్మ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

డాక్టరమ్మ వీడియో ఇదిగో..

చికిరి సాంగ్ కు బామ్మ స్టెప్పులు.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.