Sharwanand Birthday: శర్వానంద్‌కు మెగా ‘ట్రీట్‌’… ప్రీరిలిజ్‌ ఈవెంట్‌పై నీలీ మేఘాలు.. ప్రెస్‌ మీట్‌తోనే సరి.?

Sharwanand Birthday: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్‌ హీరో శర్వానంద్‌. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన శర్వానంద్‌ అనంతరం..

Sharwanand Birthday: శర్వానంద్‌కు మెగా ట్రీట్‌... ప్రీరిలిజ్‌ ఈవెంట్‌పై నీలీ మేఘాలు.. ప్రెస్‌ మీట్‌తోనే సరి.?

Updated on: Mar 06, 2021 | 1:28 PM

Sharwanand Birthday: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు యంగ్‌ హీరో శర్వానంద్‌. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన శర్వానంద్‌ అనంతరం పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన అభిమానులు సంపాదించుకున్నాడు. ఇప్పుడు శర్వానంద్‌ నుంచి సినిమా వస్తుందంటే ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఈరోజు (శనివారం) ఈ యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీలోని కొందరు శర్వాకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మెగా వపర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ శర్వానంద్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. అర్థరాత్రి కేక్‌ కట్‌ చేయించి బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ విషయమై శర్వానంద్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన శర్వానంద్‌.. ‘ఈ అద్భుతమైన పార్టీని ఏర్పాటు చేసిన చెర్రీకి కృతజ్ఞతలు’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు.

ముఖ్య అతిథిగా పవర్ స్టార్‌.?

ఒక మెగా హీరో శర్వానంద్‌కు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇస్తే.. మరో మెగా హీరో పవర్‌ స్టార్‌ కళ్యాణ్ తన సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు హాజరుకానున్నాడు. శర్వానంద్‌ హీరోగా ‘శ్రీకారం’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్‌ శనివారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తోందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా దీనికి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మాత్రం.. అసలు శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం లేదని తెలుస్తోంది. కేవలం ప్రెస్ మీట్ మాత్రమే ఏర్పాటుచేయనున్నారని సమాచారం. ఇక శర్వానంద్‌ హీరోగా ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో వస్తోన్న ‘మహా సముద్రం’ సినిమాలో శర్వానంద్‌ ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో శర్వా మాస్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు.

Also Read: Chiranjeevi : జోరు పెంచిన మెగాస్టార్.. ఆ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

Rhea Chakraborty : రియా చక్రవర్తి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఛార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌లో షాకింగ్ విషయాలు తెలిపిన ఎన్సీబీ..

Vijay Deverakonda : సుకుమార్ సినిమాలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అలా కనిపించబోతున్నాడా..?