
పవిత్ర రంజాన్ పర్వదినం వేడుకలు సోమవారం (మార్చి 31) ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు మసీదుల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అలాగే తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఇళ్లకు ఆహ్వానించి ఖీర్, బిర్యానీ తదితర వంటకాలు రుచి చూపించారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ రంజాన్ వేడుకలో భాగమయ్యారు. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈద్ వేడుకల్లో పాల్గొనడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. హైదరాబాద్‌లోని తన ముస్లిం ఫ్రెండ్ ఇంట్లో జరిగిన రంజాన్ వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా క్యాజువల్ డ్రెస్ లో సింపుల్ గా వెళ్లిన చరణ్ కి ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక చెర్రీ కూడా తన స్నేహితులందరినీ ఎంతో ప్రేమగా పలకరించాడు. వారితో చాలా సేపు ముచ్చటించాడు. అనంతరం రంజాన్ వంటకాలను రుచి చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ సినిమాతో మెగాభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. అయితే దీనిని పెద్ది సినిమాతో భర్తీ చేసేందుకు రెడీ అవుతున్నాడు గ్లోబల్ స్టార్. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ మెగాభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చాయి. సినిమాపై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తోన్న ఈ మెగా మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠీ, జగపతి బాబు తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న పెద్ది మూవీ ఈ ఏడాదే రిలీజ్ కావొచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Ram Charan at a private Eid party!
pic.twitter.com/GHqMg0yvT4— Satya (@YoursSatya) March 31, 2025
Get ready for an EPIC MUSIC & SCORE by the academy award winning legend @arrahman ❤️🔥#PEDDI audio on the prestigious @TSeries ✨🎼#PeddiFirstShot – Glimpse video out on 6th April 💥💥
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @arrahman @RathnaveluDop… pic.twitter.com/4TyGgmGn9M
— BuchiBabuSana (@BuchiBabuSana) March 31, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .