Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రెషన్స్‏లో పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో బాబాయ్.. అబ్బాయ్ ఫోటో వైరల్

|

Mar 27, 2023 | 11:06 AM

చరణ్ కు సంబంధించిన అరుదైన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్... పవన్ కు సంబంధించిన ఓ అరుదైన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Ram Charan Birthday: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రెషన్స్‏లో పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో బాబాయ్.. అబ్బాయ్ ఫోటో వైరల్
Pawan Kalyan, Charan
Follow us on

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆనతి కాలంలోనే తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటనకు భారతీయులే కాదు.. విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చెర్రీని ప్రేమించే అభిమానుల సంఖ్య చెప్పక్కర్లేదు. ఈరోజు (మార్చి 27) రామ్ చరణ్ పుట్టినరోజు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఫ్యాన్స్. చరణ్ కు సంబంధించిన అరుదైన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్… పవన్ కు సంబంధించిన ఓ అరుదైన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

రామ్ చరణ్ చిన్నప్పుడు అంటే ఆరు నెలల వయసున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తున్న ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి తన తమ్ముడు పవన్ అంటే చెప్పలేనంత ప్రేమ అన్న సంగతి తెలిసిందే. ఇక తన అన్నయ్య కొడుకు చరణ్ అంటే చాలా ఎక్కువ ఇష్టమని పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు పవన్.

ఇవి కూడా చదవండి

Ram Charan, Pawan Kalyan

ప్రస్తుతం చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ మూవీ టైటిల్ లోగో వీడియో షేర్ చేస్తూ.. చెర్రీకి బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. ఇందులో చరణ్ జోడిగా కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు.