Ram Charan and Upasana: చరణ్, ఉపాసనలకు పుట్టబోయే బిడ్డకు అపూర్వ కానుక.. పంపింది ఎవరో తెలుసా..?

రామ్ చరణ్, ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోడం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.. ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన సతీమణి కోసం కావాల్సినంత టైం స్పెండ్ చేస్తున్నాడు.

Ram Charan and Upasana: చరణ్, ఉపాసనలకు పుట్టబోయే బిడ్డకు అపూర్వ కానుక.. పంపింది ఎవరో తెలుసా..?
Ram Charan, Upasana

Updated on: Jun 17, 2023 | 1:59 PM

రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లితండ్రులు కానున్నారు. సినీ ఇండస్ట్రీలో లవబుల్ కపుల్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ జంట. రామ్ చరణ్, ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోడం మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.. ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన సతీమణి కోసం కావాల్సినంత టైం స్పెండ్ చేస్తున్నాడు. అటు ఉపాసన కూడా తన పనులలో బిజీగా ఉంది. ఈ ఏడాది జులై లో ఉపాసన బిడ్డకు జన్మనివ్వనుంది. ఇప్పటికే పుట్టబోయే బిడ్డకోసం ఉపాసన అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా చరణ్, ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోసం కానుకలు కూడా పంపిస్తున్నారు కొందరు. ఈ క్రమంలోనే ఉపాసన ఓ గిఫ్ట్ ను అందుకున్నారు. ఆ గిఫ్ట్ ఏంటి.? ఎవరు పంపారంటే..

రామ్ చరణ్- ఉపాసనలకు పుట్టబోయే బిడ్డ కోసం ఓ అందమైన ఉయ్యాలా గిఫ్ట్ గా వచ్చింది. దాన్ని పంపింది ప్రజ్వలా ఫౌండేషన్. ప్రజ్వలా ఫౌండేషన్ చరణ్- ఉపాసనలకు జన్మించే బిడ్డకోసం అందమైన ఉయ్యాలను చేయించి గిఫ్ట్ గా ఇచ్చారు, ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు ఉపాసన.

సెక్స్ ట్రాఫికింగ్‌లో ఇరుక్కొని బయటపడిన మహిళలకు ప్రజ్వల ఫౌండేషన్‌ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక ఆ మహిళలు తయారు చేసిన ఉయ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఉపాసన ఇలా రాసుకొచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. మీరు పంపిక ఈ అపూర్వ కానుక నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఈ ఉయ్యాలా  ధైర్యం, బలం, ఆత్మగౌరం, ఆశకు ప్రతీకగా తన బిడ్డకు గుర్తుండిపోతుందని.. ఈ కానుకను అందుకున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు ఉపాసన.