Upasana Konidela: ఫారిన్‏లో రామ్ చరణ్ దంపతులు.. ఉపాసన సింపుల్ డ్రెస్ ఖరీదు ఎంతంటే..

తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఫారిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఓ వెడ్డింగ్ కోసం వీరు ఫారిన్ పెళ్లారని తెలుస్తోంది. ఇటీవల వీరు ఫారిన్ వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆ సమయంలో ఎంతో సింపుల్ , కూల్ ఫ్యాషన్ లుక్‏లో కనిపించింది ఉపాసన.

Upasana Konidela: ఫారిన్‏లో రామ్ చరణ్ దంపతులు.. ఉపాసన సింపుల్ డ్రెస్ ఖరీదు ఎంతంటే..
Ram Charan Upasana

Updated on: Sep 10, 2023 | 9:26 PM

తెలుగు ప్రేక్షకులకు ఉపాసన కొణిదెల సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్‏గా కూడా చాలా ఫేమస్. ఇటీవలే జూన్ లో కూతురు క్లింకారాకు జన్మనిచ్చింది ఉపాసన. ప్రస్తుతం ఆ ముద్దులొలికే చిన్నారితో సమయాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఫారిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఓ వెడ్డింగ్ కోసం వీరు ఫారిన్ పెళ్లారని తెలుస్తోంది. ఇటీవల వీరు ఫారిన్ వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆ సమయంలో ఎంతో సింపుల్ , కూల్ ఫ్యాషన్ లుక్‏లో కనిపించింది ఉపాసన.

లైట్ పింక్ డ్రెస్‏లో ఎంబ్రయిడరి జాకెట్‏తో కూల్, స్టైలీష్ లుక్ లో కనిపించారు. అయితే ఉపాసన ధరించిన డ్రెస్ హేలీ మెన్జీస్ డిజైనర్ కు సంబంధించిన పాంథర్ కాటన్ జాక్వర్డ్.. దీని ధర రూ.42,317 ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. వీరిద్దరి ఫారిన్ వెళ్లడానికి గల కారణాలను ఉపాసన ఇన్ స్టా వేదికగా ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేశారు. ఉపాసన తన ఇన్ స్టా పోస్టులో ఒక వెడ్డింగ్ కార్డు ఇన్విటేషన్ ను షేర్ చేశారు. ఈ పోస్టును బట్టి చూస్తే వీరు పెళ్లికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఎవరి వివాహం అనేది తెలియరాలేదు. మరోవైపు ఈ ఏడాది నవంబర్ లో వరుణ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగనుంది. ఈ పెళ్లి పనులను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోనున్నట్లు సమాచారం.

Upasana Konidela

ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. కీలకపాత్రలో అంజలి కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.