SS Rajamouli Birthday: టాలీవుడ్ గతిని మార్చిన జక్కన్న… దర్శకధీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..

|

Oct 10, 2021 | 1:00 PM

టాలీవుడ్ సినిమా గతిని మార్చి.. పాన్ ఇండియా లెవల్లో తెలుగు చిత్ర ఘనతను చాటి చెప్పాడు దర్శకధీరుడు జక్కన్న.. తెలుగు చిత్ర పరిశ్రమకు

SS Rajamouli Birthday: టాలీవుడ్ గతిని మార్చిన జక్కన్న... దర్శకధీరుడికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ..
SS Rajamouli
Follow us on

టాలీవుడ్ సినిమా గతిని మార్చి.. పాన్ ఇండియా లెవల్లో తెలుగు చిత్ర ఘనతను చాటి చెప్పాడు దర్శకధీరుడు జక్కన్న.. తెలుగు చిత్ర పరిశ్రమకు అతనే చత్రపతి.. సినీ రంగులద్దిన విక్రమార్కుడు.. రాయలసీమ సంప్రదాయాలను.. నడవడికను వెండితెరపై చూపించిన ఓ మార్యాద రామన్న.. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తే స్థాయికి ఎదిగారు. ఎన్నో చిత్రాలను అద్భుతంగా తనదైన స్టైల్లో చెక్కిన జక్కన్నగా నిలిచారు. ఇక రాజమౌళి సినిమాలో నటించిన చిన్న హీరో సైతం పాన్ ఇండియా స్టార్‏గా మారిపోవాల్సిందే. సినిమా కోసం ఎంతటి స్టార్ హీరోలనైనా.. సానబెట్టి.. తనకు తానుగా.. సినిమాకు తగ్గట్టుగా మలుచుకుంటారు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ సినిమా రేంజ్‏ను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు జక్కన్న. అంతేకాకుండా.. ఈగ సినిమాతో సరికొత్త ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. ఈరోజు దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు.. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు.

జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా.. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నారు రాజమౌళి.. జక్కన్న పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
ట్వీట్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ట్వీట్..

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం.. జక్కన్నకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ట్వీట్..

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జక్కన్నకు తన ట్విట్టర్ ఖాతా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ట్వీట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం.. దర్శకధీరుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు..
ట్వీట్..

Also Read: MAA Elections 2021: మా ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్‏ను తీసుకువస్తా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జీవీ..

S S Rajamouli birthday special: టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన ‘జక్కన్న’ అరుదైన ఫోటోలు.. ‘ఎస్.ఎస్.రాజమౌళి’ స్టైల్ మాములుగా లేదు..