
తొలి సినిమాతోనే దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు సన. దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన ఉప్పెన సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో సెకండ్ ప్రాజెక్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేసే ఛాన్స్ కొట్టేశాడు. #RC 16 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అలాగే ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం వేడుక ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ శంకర్, డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, బోనీ కపూర్ తోపాటు.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆర్సీ 16 పూజా కార్యక్రమానికి వచ్చిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. బుచ్చిబాబు రాసిన కథ తనకెంతో నచ్చిందన్నారు. ప్రేక్షకులు ఈ సినిమా చూసి తప్పకుండా ఎంటర్టైన్ అవుతారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో చరణ్, జాన్వీ పక్కపక్కనే ఉన్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మళ్లీ ఇప్పుడు చిరు తనయుడు.. శ్రీదేవి తనయ కలిసి సినిమా చేస్తుండడం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జె్ట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాను గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యాకే రెగ్యూలర్ షూట్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
Best Wishes Anna @BuchiBabuSana ❤️#RC16PoojaCeremony @AlwaysRamCharan #JanhviKapoor pic.twitter.com/IH6weMnF4J
— Trends RamCharan ™ (@TweetRamCharan) March 20, 2024
Man of Masses @AlwaysRamCharan and #Sukumar from #RC16PoojaCeremony 💥#RC16 #RamCharanRevolts pic.twitter.com/aXlHhIixVu
— SAI CHARANISM ™ (@saigaduRcFan) March 20, 2024
. @AlwaysRamCharan & #JanhviKapoor looking good together 😍🥰
#RC16PoojaCeremony #RC16 #RamCharanRevoltspic.twitter.com/kGIm1XURO4
— John Wick (@JohnWick_RC) March 20, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.