డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు.. కన్స్యూమరేనా? లేక డ్రగ్ పెడ్లర్ కూడానా ? పోలీసుల ఆరా..

అమన్‌ ప్రీత్‌ సింగ్‌ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఇటీవల కాలంలో అమన్ సింగ్ పేరు వార్తలలో తెగ వినిపిస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్‌ కేసుల గురించి చెబితే అమన్ ఎంత ఫేమస్సో ఇంకా బాగా తెలిసిపోతుంది. మరోసారి డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం కలకలం రేపుతోంది. మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్‌ను A-7గా పోలీసులు చేర్చారు.

డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు.. కన్స్యూమరేనా? లేక డ్రగ్ పెడ్లర్ కూడానా ? పోలీసుల ఆరా..
Aman Singh

Updated on: Dec 28, 2025 | 7:28 AM

డ్రగ్స్ కేసుల్లో తరచూ వినిపిస్తున్న పేరు అమన్ ప్రీత్ సింగ్. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిగా గుర్తింపు పొందిన ఈయన పేరు…డ్రగ్స్ కేస్ లో కన్స్యూమర్‌గా వినపడడం ఇది తొలిసారి కాదు. గత ఏడాది జూలైలో నార్సింగ్ పోలీసులు అమన్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో విచారణ అనంతరం నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి అదే తరహా కేసులో ఆయన పేరు రావడం పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ కేసుల్లో ప్రతిసారి కన్స్యూమర్‌గా మాత్రమే దొరుకుతున్నాడు, వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా అనే యాంగిల్‌లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవైపు సినిమా ట్రయల్స్, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న అమన్ ప్రీత్ సింగ్ ముంబై, హైదరాబాద్ నగరాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. అమన్ ప్రీత్ సింగ్, గత రెండు సంవత్సరాలుగా డ్రగ్స్ వాడుతున్నాడన్న అనుమానాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్టున్నట్లు సమాచారం.

డ్రగ్స్ సప్లయర్లకు అమన్ ప్రీత్ సింగ్‌కు మధ్య జరిగిన లావాదేవీలపై ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, డిజిటల్ చాట్స్ వంటి అంశాలను పరిశీలిస్తూ డ్రగ్స్ నెట్‌వర్క్‌తో అతగాడికి ఉన్న సంబంధాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కేసుల్లో తరచూ కన్స్యూమర్ లిస్టులో అమన్ ప్రీత్ సింగ్ పేరు ఉండడంతో, ఈసారి మాత్రం కఠినంగా వ్యవహరించాలన్న దిశగా పోలీసులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధారాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. పరారీలో ఉన్న అమన్ ప్రీత్ సింగ్ కోసం ముంబైకి పోలీస్‌ టీమ్స్‌ వెళ్లాయి.

ఇవి కూడా చదవండి : Vinay Rai: అప్పుడు హీరోగా.. ఇప్పుడు విలన్‏గా.. ఈ నటుడి ప్రియురాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరంటే.

నార్సింగి డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్‌ను ఏ11గా పోలీసులు గుర్తించారు. తాజాగా పెట్టిన మాసబ్‌ట్యాంక్‌ డ్రగ్స్‌ కేసులో అమన్‌ను A-7గా చేర్చారు పోలీసులు. గతంలోనూ డ్రగ్స్ కేసుల్లో కన్స్యూమర్‌గా పట్టుబడ్డ అమన్ ప్రీత్ సింగ్, అప్పట్లో పోలీసుల కౌన్సిలింగ్ అనంతరం తన తీరు మార్చుకున్నట్లు నటించినప్పటికీ, మళ్లీ అదే బాట పట్టినట్లు తాజా విచారణలో బయటపడింది. గడిచిన ఆరు నెలల వ్యవధిలోనే రూ.2 లక్షల రూపాయలు పెట్టి, అతగాడు ఐదుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. ఈ లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, ఆర్థిక వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అమన్‌ప్రీత్‌ సింగ్‌ కోసం గాలిస్తున్నామని, అతడు చిక్కగానే అరెస్ట్‌ చేస్తామని వెస్ట్‌జోన్‌ DCP శ్రీనివాస్‌ చెప్పారు. కౌన్సెలింగ్‌ తర్వాత కూడా అమన్‌ ప్రీత్‌ మారకపోవడం, డ్రగ్స్ కేసుల్లో పదేపదే అతగాడి పేరు వినిపిస్తుండడంతో, ఈసారి పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Rajinikanth: రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది.. సంచలన కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..