Rakul Preet Singh: గ్లామర్‌తో కొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్..! అన్నింటికీ అందమే సమాధానం

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్టులో అగ్రస్థానంలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు కొత్త దారిలో నడుస్తోంది. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షోలో తగ్గని ఆమె, ప్రతి ఈవెంట్‌, ఫొటోషూట్‌లో తన హాట్ లుక్స్‌తో హైలైట్ అవుతోంది. కానీ ఈ గ్లామర్ గేమ్ కెరీర్‌ను రక్షించగలదా అన్న ప్రశ్న మాత్రం మిగిలింది.

Rakul Preet Singh: గ్లామర్‌తో కొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్..! అన్నింటికీ అందమే సమాధానం
Rakul Preet Singh

Edited By: Ram Naramaneni

Updated on: Nov 04, 2025 | 4:37 PM

స్టార్ హీరోయిన్ల జాబితాలో ఒకప్పుడు టాప్‌లో నిలిచిన పేరు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన క్యూట్ లుక్స్, స్మార్ట్ అటిట్యూడ్, బబ్లీ ఎనర్జీతో ఫ్యాన్స్ హార్ట్‌ని కొల్లగొట్టింది ఈ పంజాబీ సుందరి. కానీ ఇప్పుడు ఆ గ్లామర్ గేమ్ కొంచెం కష్టాల్లో ఉంది. రకుల్ కెరీర్ ఎటువైపు వెళ్తుంది..? గ్లామర్ షోతో నెట్టుకొస్తుందా..? అనే అనుమానాలు వస్తున్నాయిప్పుడు. రకుల్‌కు గ్లామర్ షో కొత్తేమీ కాదు. కెరీర్ ప్రారంభం నుంచి ఆమె లుక్‌, స్టైల్‌, ఫిట్‌నెస్ అన్నీ పర్ఫెక్టుగా ఉండేవి. టాలీవుడ్‌లో ఆమె చేసిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, కరెంట్ తీగ, ధృవ లాంటి సినిమాలు బ్యూటీతో పాటు నటనకు కూడా నిదర్శనమే. కానీ టైమ్ గడుస్తున్న కొద్దీ.. ఇండస్ట్రీలో పోటీ పెరిగిన కొద్దీ రకుల్ తన గ్లామర్ డోస్‌ను పెంచింది. ఇప్పుడు ప్రతి ఈవెంట్‌లోనూ, సోషల్ మీడియాలోనూ, ఫ్యాషన్ ఫోటోషూట్లలోనూ ఆమె అందాల ఆరబోతే ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అయింది.

పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్‌లు వెనక్కి తగ్గుతారని అనుకునే సమయంలో.. రకుల్ మాత్రం గ్లామర్ షోలో రెచ్చిపోతుంది. భగ్నాని కుటుంబం కోడలైన తర్వాత ఆమె లుక్స్ మరింత హాట్‌గా మారాయి. స్టైలింగ్‌, డ్రెస్ సెన్స్‌, బోల్డ్ ఫొటోషూట్స్.. ఇవన్నీ ఆమె కొత్త ఐడెంటిటీగా మారాయి. గ్లామర్‌నే ప్రధాన ఆయుధంగా వాడుకుంటూ నేను ఇక్కడే ఉన్నా అని ఇండస్ట్రీకి చెప్పాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. గ్లామర్ షోతో ఆకర్షించడం ఒక వైపు అయితే.. పెద్ద హిట్స్ ఇవ్వడం మరోవైపు ఈమెకు సవాల్‌గా మారింది. హిందీలో రీసెంట్‌గా ఆమె చేసిన రన్‌వే 34, థ్యాంక్ గాడ్, డాక్టర్ జి లాంటి సినిమాలు సరైన రిజల్ట్ ఇవ్వలేదు. ప్రేక్షకులు ఆమె అందాన్ని ఎంజాయ్ చేసినా, కథల బలహీనత ఆ సినిమాలను రక్షించలేదు. టాలీవుడ్‌లో కూడా గత కొన్నేళ్లుగా ఆమెకు పెద్ద అవకాశాలు రాలేదు.

కొత్త హీరోయిన్లు కంటెంట్, డ్యాన్స్, పర్ఫార్మెన్స్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ పోటీ మధ్య రకుల్ తన స్పాట్‌ను తిరిగి సంపాదించుకోవాలంటే.. కేవలం గ్లామర్ కాదు, బలమైన పాత్రల ఎంపికే కీలకం అవుతోంది. రకుల్ ప్రీత్ సింగ్‌కి ఉన్న మరో బలం ఆమె ఫిట్‌నెస్. సోషల్ మీడియాలో జిమ్ వీడియోలు, యోగా ఫొటోలు, హెల్తీ లైఫ్‌స్టైల్ టిప్స్‌ ఇవన్నీ ఆమెను ఫిట్‌నెస్ ఐకాన్‌గా నిలబెట్టాయి. అలాగే ఫ్యాషన్ బ్రాండ్స్, బ్యూటీ ఎండార్స్‌మెంట్స్‌ విషయంలో ఆమెకు డిమాండ్ తగ్గలేదు. అంటే ఆమె మార్కెట్ ఇంకా మాయం కాలేదు. ఇప్పుడు రకుల్ చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయని తెలుస్తుంది. వాటిలో ఒకటి సస్పెన్స్ డ్రామా, మరొకటి ఫీమేల్ సెంట్రిక్ మూవీ. సరైన స్క్రిప్ట్‌లు, న్యూ ఏజ్ డైరెక్టర్లతో కలిస్తే రకుల్ మళ్లీ తన గ్లామర్, టాలెంట్‌ మిక్స్‌తో స్క్రీన్‌ను డామినేట్ చేసే సత్తా ఉంది.. కానీ అలా జరగాలంటే సరైన సినిమా పడాలి. అది జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి