
ఈ శుక్రవారం (నవంబర్ 21) థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఖమ్మంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమాను డైరెక్టర్ సాయిలు తెరకెక్కించారు. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించారు. కొత్త డైరెక్టర్, కొత్త నటీనటులే అయినా ఈ సినిమాకు సూపర్ హిట్ వచ్చింది. ముఖ్యంగా డైరెక్టర్ టేకింగ్, మేకింగ్‌కి విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ సాయిలు చేసిన కామెంట్స్ కొన్ని హాట్ టాపిక్ గామారాయి. తన సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే తాను అమీర్ పేటలో చొక్కావిప్పి తిరుగుతానని సవాలు విసిరిరాడు. సాయిలు కామెంట్స్ సోషల్ మీడియాలో సంచనలంగా మారాయి. కొత్త డైరెక్టర్ అయ్యి ఉండి ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్ అవసరమా? అన్న నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడాడీ యంగ్ డైరెక్టర్. ‘ నాలాంటి కొత్త డైరెక్టర్లకు మాట్లాడటం రాదు. దయచేసి క్షమించండి అన్న. అమీర్‌పేట్‌లో సాయంత్రం వచ్చి బ్యాండ్ కొడతా అన్నా’ అని మాటిచ్చాడు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్.
తన సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఆదివారం (నవంబర్ 23) సాయంత్రం అమీర్ పేట్ కు వచ్చాడు డైరెక్టర్ సాయిల్. అక్కడి ఏషియన్ AAA సత్యం థియేటర్ ముందు డప్పు కొట్టి సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ అన్నా.. మీరు (ఆడియన్స్) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇక నేను కూడా మాట నిలబెట్టుకోవాలి కదా. చెప్పినట్టుగానే అమీర్ పేట్ వచ్చాను. ఇక్కడ మన సత్యం థియేటర్ ముందు ఉన్నా. ఇప్పుడు మీ కోసం బ్యాండ్ కొడుతున్నా’ అంటూ మూవీ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నాడు సాయిలు. అలాగే ఈ సినిమాలో విలన్ గా నటించిన సిద్దూ జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జొన్నలగడ్డ కూడా డప్పు కొట్టి అభిమానులను ఉత్సాహ పరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.