హ్యాపీ బర్త్ డే తలైవా..! సూపర్ స్టార్‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. మోడీ, కమల్, ధనుష్‌తోపాటు

సినిమా పరిశ్రమలో స్టార్స్‌ ఉంటారు, మెగాస్టార్స్‌ ఉంటారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఒక్కరే. ఆయన కేవలం నటుడు కాదు, దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం. ఆయన స్క్రీన్‌పై కనిపించినా, కనిపించకపోయినా ఆ పేరుకు ఉన్న క్రేజ్, వైబ్రేషన్ వేరు.

హ్యాపీ బర్త్ డే తలైవా..! సూపర్ స్టార్‌కు వెల్లువెత్తుతున్న విషెస్.. మోడీ, కమల్, ధనుష్‌తోపాటు
Rajinikanth

Updated on: Dec 12, 2025 | 1:30 PM

రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఆయన. ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు ఆయనది. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన వాకింగ్ స్టైల్.. యాటిట్యూడ్ అంటే అభిమానులకు చాలా ఇష్టం. నేడు రజినీకాంత్ పుట్టిన రోజు నేడు. నేటితో 75ఏళ్ల వసంతంలోకి అడుగుపెట్టారు. అలాగే ఆయన సినీ ప్రయాణానికి 50ఏళ్లు పూర్తయ్యాయి. ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టిన రోజు విషెస్ తెలుపుతున్నారు. కండక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్, తలైవాగా నిలిచిన రజినీ సినీ ప్రయాణం అంతా మాములుగా సాగలేదు. రజినీ సినిమాలు ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ రికార్డ్స్ బ్రేక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడం కేవలం ఆయన వల్లే సాధ్యం. ఇప్పటివరకు ఏ హీరో తీసుకుని పారితోషికం తీసుకోవడం సైతం ఆయనకే సాధ్యమైంది.

ఇటీవల సెన్సెషన్ సృష్టించిన జైలర్, కూలీ సినిమాలకు ఏకంగా రూ.200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నారు రజినీ. ఈరోజు తలైవా పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూపర్ స్టార్ కు స్పెషల్ విషెస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లుకూడా సూపర్ స్టార్ కు విషెస్ తెలిపారు. 75ఏళ్ల  ఎలాంటి రీమార్క్ లేని జీవితం,50 ఏళ్ల సినిమాల్లో లెజెండ్.. పుట్టిన రోజు శుభాకాంక్షలు మై ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశారు కమల్.

రాఘవ లారెన్స్ కూడా సూపర్ స్టార్ కు విషెస్ తెలిపారు… “హ్యాపీ బర్త్ డే తలైవా.. మీరు ఆరోగ్యంతో ఉండాలని ఆ రాఘవేంద్ర స్వామిని ప్రార్ధిస్తున్నాను.. గురువే శరణం” అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

అలాగే మోహన్ లాల్, ధనుష్, యోగిబాబు, సిమ్రాన్, టాలీవుడ్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, దర్శకుడు బాబీ, వెంకట్ ప్రభు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మోహన్ లాల్

ధనుష్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి