AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: సినిమాల్లో నీతులు చెప్తే సరిపోదు సారూ..! రజినీకాంత్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్

జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన జైలర్ సినిమా ఏకంగా 700కోట్లు వసూల్ చేసింది. అలాగే లాల్ సలాం సినిమాలో నటించారు రజిని కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Rajinikanth: సినిమాల్లో నీతులు చెప్తే సరిపోదు సారూ..! రజినీకాంత్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
Rajinikanth
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2024 | 11:46 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఫ్యాన్ కానీ ప్రేక్షకులు ఉండరేమో.. ఏడుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రజిని. జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన జైలర్ సినిమా ఏకంగా 700కోట్లు వసూల్ చేసింది. అలాగే లాల్ సలాం సినిమాలో నటించారు రజిని కానీ ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు వరుస సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ ను కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. వివాదాలకు, కాంట్రవర్సి‌కి దూరంగా ఉంటారు. కానీ ఇప్పుడు ట్రోలర్స్ బారిన పడ్డారు. దానికి కారణం ఏంటంటే..

అపార కుబేరుడు అంబానీ ఇంట ఇటీవల పెళ్లి వేడుకలు జరిగిన విషయం తెలిసిందే.. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజులు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెజెండ్స్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

అయితే అక్కడ జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వేడుకకు హాజరైన సూపర్ స్టార్ రజినికాంత్ ను ఫోటోలు తీసేందుకు మీడియా వాళ్లు సిద్ధమయ్యారు. ఇంతలో ఆయన పక్కన ఉన్న పనిమనిషిని పక్కకు వెళ్ళమని అన్నారు. దాంతో ఆమె వెనక్కు వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ కూడా ఆమెను వెనక్కి పంపించేశారు. ఇప్పుడు ఈ వీడియో పై నెటిజన్ విమర్శలు చేస్తున్నారు. సూపర్ స్టార్ ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల్లో నీతులు చెప్పే హీరో ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. అయితే అక్కడున్న ఫొటోగ్రాఫర్లు ఫ్యామిలీ ఫోటో కావాలి అని అడగటంతో రజినీకాంత్ అలా చేశారు అంతే తప్ప.. ఆమెను అవమానించడానికే కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్