Rajinikanth: వామ్మో.. షాకిస్తోన్న డైరెక్టర్ రెమ్యునరేషన్.. కూలీ సినిమాకు లోకేష్ పారితోషికం ఎన్ని కోట్లంటే..

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చివరగా జైలర్ సినిమాతో హిట్టు అందుకున్న తలైవా.. ఇప్పుడు కూలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

Rajinikanth: వామ్మో.. షాకిస్తోన్న డైరెక్టర్ రెమ్యునరేషన్.. కూలీ సినిమాకు లోకేష్ పారితోషికం ఎన్ని కోట్లంటే..
Coolie Movie

Updated on: May 28, 2025 | 10:20 AM

జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు కూలీ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఏడు పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ప్రస్తుతం తలైవా నటిస్తోన్న కూలీ చిత్రంపై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, శ్రుతీహాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తుండడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. రజినీ కెరీర్ లో 171వ సినిమాగ వస్తున్న ఈ సినిమా గురించి నిత్యం ఏదోక న్యూస్ వైరలవుతుంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్, రెమ్యునరేషన్ విషయాలపై ఫిల్మ్ వర్గాల్లో అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజినీకి రూ.150 కోట్ల పారితోషికం ఇస్తున్నారట. ఇక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని.. మిగిలిన 150 కోట్లతో సినిమాతోపాటు ఇతర నటీనటులకు పారితోషికాలు ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పబ్లిసిటీ సైతం ఓ రేంజ్ లో చేయనున్నారని.. అందుకు రూ.25 కోట్లు వెచ్చించే ఆలోచనలో ఉన్నట్లు టాక్. మొత్తం కలిపితే.. ఈ సినిమా బడ్జెట్ రూ.375 పైగానే అవుతుంది. దీంతో రజినీ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యా్న్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసిందని టాక్. ఈ ఏడాది ఆగస్ట్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయళం భాషలలోనూ ఈ సినిమా విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..