Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ తీరు మార్చుకోవాల్సిందేనా.. ట్రాక్ తప్పుతున్నాడా..?

నటకిరీటి రాజేంద్రప్రసాద్ పేరు వినగానే నవ్వు తెప్పించే పాత్రలు గుర్తొస్తాయి. కానీ ఇటీవలి కాలంలో ఆయన మాటలు మాత్రం నవ్వు కంటే ట్రోల్స్ తెచ్చిపెడుతున్నాయి. రాబిన్ హుడ్, మాస్ జాతర సినిమాల ప్రమోషన్స్‌లో ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్స్ ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి.

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ తీరు మార్చుకోవాల్సిందేనా.. ట్రాక్ తప్పుతున్నాడా..?
Rajendra Prasad

Edited By: Ram Naramaneni

Updated on: Nov 04, 2025 | 4:20 PM

తెలుగు ఇండస్ట్రీలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ పేరు చెప్పగానే కామెడీ, ఎమోషనల్ పాత్రలు గుర్తొస్తాయి. కానీ ఇటీవల కాలంలో ఆయన మాటలు మాత్రం ఓవర్ బిల్డప్‌తో నిండిపోయి, మిస్‌ఫైర్ అవుతున్నాయి. రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్‌లో తన పాత్ర నచ్చకపోతే పేరు మార్చుకుంటానని, మాస్ జాతర క్లైమాక్స్ చూసి విజిల్స్ పడకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానని చెప్పడం ఇందుకు ఉదాహరణలు. ఈ స్టేట్‌మెంట్స్ ఆయనకు ట్రోలింగ్ తెచ్చిపెట్టాయి. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు ప్రచారం కోసమే అయినా.. సినిమా ఫలితం బట్టి బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు నెటిజన్లు. మాస్ జాతర రిలీజ్ తర్వాత రాజేంద్రప్రసాద్ మాటలను బాగా వైరల్ చేస్తున్నారు కొందరు. సినిమా ఎలా ఉందనే విషయం పక్కనబెడితే రాజేంద్రుడి స్పీచ్ మాత్రం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయినా.. సీనియర్ నటుడిగా ఇంత బోల్డ్‌గా మాట్లాడటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 2024 అక్టోబర్‌లో రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించింది. ఆమెకు భర్త, చిన్న కూతురు ఉన్నారు. గాయత్రి లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంతకాలం తండ్రితో మాట్లాడలేదు. ఆయన ఆమెను తల్లిలా చూసుకునేవారు.. ఈ దురదృష్టకర ఘటన ఆయనపై తీవ్ర మానసిక ప్రభావం చూపింది. షూటింగ్‌లో ఉండగా వార్త విని హాస్పిటల్‌కు చేరుకున్నా.. ఆమెను చివరిసారి చూడలేకపోయాను అంటూ కన్నీరు పెట్టుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి సెలబ్రిటీలు అప్పుడు వచ్చి సంతాపం తెలిపారు. ఈ ట్రాజెడీ తర్వాత ఆయన మాటలు కాస్త ట్రాక్ తప్పుతున్నాయి.

మొదట్లో కూతురు పోయిన బాధలో మాట్లాడుతున్నాడులే అని వదిలేసారు కానీ రాను రాను ఆ మాటలు కాస్త ట్రాక్ తప్పుతున్నాయనే విమర్శలు ఎక్కువగానే వస్తున్నాయి. దుఃఖం నుంచి బయటపడేందుకు సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టి, కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారేమో అనే చర్చ కూడా జరుగుతోంది. రాజేంద్రప్రసాద్ స్టేట్‌మెంట్స్ రిలీజ్ ముందు బజ్ క్రియేట్ చేస్తున్నాయి కానీ, సినిమా ఫలితం బట్టి బ్యాక్‌ఫైర్ అవుతున్నాయి. రాబిన్ హుడ్‌లో ఆయన పాత్రకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది.. కానీ సినిమా అంచనాలు నెరవేరలేదు. మాస్ జాతరలో క్లైమాక్స్‌లో ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రివీల్ బాగున్నా.. మొత్తం సినిమా రొటీన్ స్టోరీ లైన్‌తో ఉంది. దాంతో ఇండస్ట్రీ వదిలేసి వెళ్తా అనే మాటలు ట్రోల్స్‌కు గురయ్యాయి.

నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్లు కూడా ఇలాంటి స్టేట్‌మెంట్స్‌తోనే గతంలో ట్రోల్ అయ్యారు. అందుకే మొన్న మాస్ జాతర ఈవెంట్‌లో నాగవంశీ అస్సలేమీ మాట్లాడలేదు. అదే ఈవెంట్‌లో రాజేంద్రప్రసాద్ మాటలు పబ్లిసిటీకి ఉపయోగపడడ్డాయి. కానీ లాంగ్ టర్మ్‌లో ఈ మాటలు ఆయన ఇమేజ్‌కు హాని కలిగిస్తున్నాయంటున్నారు అభిమానులు. రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. కూతురు మరణం తర్వాత ఆయన మానసికంగా కుంగిపోయి, సినిమాల ద్వారా బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ ఓవర్ హైప్ మిస్‌ఫైర్ అవుతుంది కాబట్టి కాస్త చూసుకుని మాట్లాడితే బెటర్ అంటున్నారు విశ్లేషకులు. మరి రాజేంద్రుడు మారతాడా.. మాట అదుపులో ఉంచుకుంటాడా అనేది చూడాలిక.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి