యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇద్దరూ స్టార్ హీరోలతో.. జక్కన్న చేస్తున్న సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోస్ నెట్టింట్లో రికార్డ్స్ క్రియేట్ చేశాయి.. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జక్కన్న భారీ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం… రౌద్రం రణం రుధిరం సినిమా ప్రమోషన్స్‌లో జక్కన్న కొత్త పుంతలు పూయిస్తున్నాడట. ఇక సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండంతో ప్రమోషన్స్ వేగవంతం చేయాలని భావిస్తున్నారట. అయితే అన్ని సినిమాల మాదిరిగానే కాకుండా.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ అన్ని భాషల్ని కవర్ అయ్యేలా చేస్తూ ప్రచారం చేయాలని భావిస్తున్నారట. అంటే.. అక్కడి స్థానిక భాషల్లోనే చిత్రబృందం ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. అంటే అక్కడి స్థానిక భాషను చిత్రయూనిట్ నేర్చుకుని.. ప్రచారం నిర్వహించాలన్న మాట. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్.. ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్ ప్రక్రియను పూర్తిచేశాడట. మరోవైపు ఎన్టీఆర్, చరణ్ సైతం తమ డబ్బింగ్ ప్రక్రియను పూర్తిచేశారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు కీలక పాత్రలలో కనిపించనున్నారు.