S. S. Rajamouli : ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడు.. జక్కన్న ఇంట్రస్టింగ్ కామెంట్స్

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్(Ranbir Kapoor)నటిస్తున్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర(Brahmāstra). ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు.

S. S. Rajamouli : ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడు.. జక్కన్న ఇంట్రస్టింగ్ కామెంట్స్
SS Rajamouli

Updated on: Jun 01, 2022 | 10:01 AM

బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్(Ranbir Kapoor)నటిస్తున్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర(Brahmāstra). ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో రిలీజ్ చేయనున్నారు. రణబీర్ కపూర్ – అలియా భట్ – అమితాబ్ బచ్చన్ – మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ కథతో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను మూడు పార్ట్ లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’  ఫస్ట్ పార్ట్ ని ”బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ” పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 4 సంవత్సరాల క్రితం కరణ్ జోహార్ గారు ఫోన్ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను, మా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అని ఒకరున్నారు ఒక సారి ఈ కథ విన్నాక మీకు నచ్చితే మిమ్మల్ని సౌత్ ఇండియాలో ఈ సినిమాకి సమర్పకుడిగా అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ తరువాత మొదటి సారి అయాన్ ను కలిసాను. ఆయన కథ చెప్పిన విధానం కంటే ఆయన సినిమా మీద పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్నా ఎక్సయిట్మెంట్ కి నేను చాలా చాలా ఇంప్రెస్స్ అయ్యాను. ఆ తరువాత తను తయారుచేసుకున్న విజువల్స్ తన అప్పటివరకు షూట్ చేసిన మెటీరియల్ అంత చూపిస్తుంటే సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను. ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీదే చూడాలి అనే ఒక సినిమాని తయారుచేసాడు . ఈ సినిమాని నాకు 20 నిమిషాలే చూపించి, మా నాన్నగారికి మొత్తం చూపించాడు అన్నారు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి పెట్టుకున్నాడు అని నాన్నగారు చెప్పారు. ట్రిపుల్ ఆర్ తర్వాత నేను రెండుసార్లు బొంబాయ్ కి వచ్చాను అయినా నాకు సినిమా మొత్తం చూపించలేదు. అయినా అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు అన్నట్లు, నాకు ఆ 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది అంటూ చెప్పుకొచ్చారు జక్కన్న.