
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట్లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆతర్వాత ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. గుంటూరు కారం సినిమా 250కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు స్టైల్, డాన్స్ ప్రేక్షకులను విచ్చలవిడిగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలయ్యాయి. మహేష్ బాబు ఇటీవలే విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చారు. ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా స్టోరీని పూర్తి చేశారు స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి పెద్ద ప్లానే వేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకోసం తన టీమ్ లో చిన్న చిన్న మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. అత్యంత బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ సినిమాను భారీగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు రాజమౌళి తన టెక్నీషియన్స్ ని మార్చలేదు. కానీ ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం తన టీమ్ లో ఇద్దరిని మార్చినట్టు తెలుస్తోంది. కెమెరా మ్యాన్ గా కేకే సెంథిల్ కుమార్ ప్లేస్ లో పీఎస్ వినోద్ రీప్లేస్ చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే వీఎఫ్ఎక్స్ డిజైనర్ ను కూడా మారుస్తున్నారట జక్కన్న. విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా కమల కన్నన్ మహేష్ సినిమా కోసం తీసుకుంటున్నారట రాజమౌళి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.