SS Rajamouli: నాటు నాటు పాటను మెచ్చిన హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్.. దేవుడిని కలిశానంటూ జక్కన్న ట్వీట్..

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నారు.

SS Rajamouli: నాటు నాటు పాటను మెచ్చిన హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్.. దేవుడిని కలిశానంటూ జక్కన్న ట్వీట్..
Rrr Movie

Updated on: Jan 14, 2023 | 4:27 PM

ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. జక్కన్న టేకింగ్‏కు భారతీయులే కాదు.. విదేశీయులు.. హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఫిదా అయ్యారు. మెగా పవర్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు యావత్ ప్రపంచం ప్రశంసలు కురిపించింది. ఇక ఇటీవల విశ్వవేదికపై ట్రిపుల్ ఆర్ మరోసారి సత్తా చాటింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నారు. ఈ వేడుకలకు జక్కన్న… కీరవాణి.. రామ్ చరణ్.. తారక్ తమ కుటుంబసమేతంగా హజరయ్యారు. అయితే ఈ అవార్డ్ ప్రదానోత్సవ వేడుకలలో హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్‏ను ట్రిపుల్ ఆర్ చిత్రబృందం కలుసుకుంది. దీంతో తన ఫ్యాన్ బాయ్ ముచ్చటను తీర్చుకున్నాడు జక్కన్న.

హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్ బర్గ్ (76)తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ నా దేవుడిని కలిశాను అంటూ రాసుకొచ్చారు జక్కన్న. ఆయన షేర్ చేసిన ఫోటోలో రాజమౌళి ఎక్స్ ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. ఈ ఫోటోలో జక్కన్నతోపాటు కీరవాణి కూడా ఉన్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న నాటు నాటు పాటను స్టీవెన్ స్పీల్ బర్గ్ లైక్ చేశారని..తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇక ఇదే ఫోటోను కీరవాణి షేర్ చేస్తూ.. సినిమాల దేవుడిని కలుసుకునే అవకాశం వచ్చింది. డ్యూయల్‏తో ఆయన సినిమాలను నేను ఎంతగా ఇష్టపడతానో ఆయనకు చెప్పాను అంటూ రాసుకొచ్చారు. నాటు నాటు పాటను ఆయన ఇష్టపడడం తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లు చెప్పారు కీరవాణి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.