
నటి జరీనా వహాబ్ తన కుమారుడు సూరజ్ పంచోలి జియా ఖాన్ కేసులో పదేళ్ల సుదీర్ఘ పోరాటం గురించి తెలిసిందే.. దాని ఫలితంగా ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2013లో ప్రారంభమైన ఈ కేసు 10 ఏళ్ల తర్వాత సూరజ్ కు క్లీన్ చిట్ లభించడంతో ముగిసిందని ఆమె తెలిపారు. జియా ఖాన్ ఆత్మహత్య కేసులో సూర్యజ్ పంచోలి ఇరుక్కున్నాడు. దాదాపు 10ఏళ్ల తర్వాత ఆమె సూసైడ్ కు సూరజ్ సంబంధం లేదు అని కోర్టు తేల్చి చెప్పింది. జరీనా వహాబ్ కథనం ప్రకారం, జియా ఖాన్, సూర్యజ్ పంచోలిల మధ్య కేవలం నాలుగు నెలల స్నేహం మాత్రమే ఉంది. సూరజ్ దుబాయ్‌లో ఉన్నప్పుడు జియా సిగరెట్లు తీసుకురావాలని మెసేజ్ చేయడంతో వారి పరిచయం మొదలైంది. జియాకు సూరజ్ గురించి పెద్దగా తెలియదని, కేవలం ఆమె పేరు మాత్రమే అతనికి తెలుసునని ఆమె వివరించారు. ఈ పరిచయం మొదలైన కొన్ని నెలలకే జియా ఆత్మహత్య చేసుకుంది.
సూరజ్ ను బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సమయంలో, జియా ఖాన్ ప్రవర్తన గురించి సూరజ్ ను తాను హెచ్చరించినట్లు జరీనా వహాబ్ తెలిపారు. జియా గతంలో రిలేషన్‌షిప్‌లు నడిపింది. అవి ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్యాయత్నాలు చేసిందని విన్నట్లు ఆమె కొడుకుతో చెప్పారట. ఈ అమ్మాయితో జాగ్రత్తగా ఉండమని నేను సల్మాన్ ఖాన్‌కు కూడా చెప్పాను అని జరీనా గుర్తు చేసుకున్నారు. సూరజ్, జియాల మధ్య బ్రేకప్ కూడా జియా ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నెల ముందు జరిగిందని ఆమె అన్నారు.
ఆత్మహత్యకు ముందు జియాకు తెలుగు సినిమాలో అవకాశం వచ్చినా, స్క్రీన్ టెస్ట్‌లో రిజెక్ట్ అయ్యిందని జరీనా అన్నారు . ఆమె స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ఆ పాత్రను దక్కించుకున్నారని తెలిపారు. ఆ తర్వాత జియా తీవ్ర నిరాశకు గురైందని, సూరజ్ ను కలవడానికి ప్రయత్నించినా, అతను తన సినిమా శిక్షణలో ఉన్నందున ఫోన్ తీయలేదని ఆమె తెలిపారట. జియా తల్లి మొదట మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తెకు పని దొరకకపోవడం వల్ల నిరాశకు గురై ఆత్మహత్య చేసుకుందని చెప్పింది.. అయితే కేసు పోలీసుల దగ్గరకు వెళ్ళిన తర్వాతఆమె ప్లేట్ మార్చిందని జరీనా వహాబ్ అన్నారు. అయితే జియా సూసైడ్ నోట్ ను ఆమె తల్లి రాసింది. జియా తల్లి కోర్టులో ఆ నోట్‌ను తానే రాశానని అంగీకరించినట్లు జరీనా పేర్కొన్నారు. ఈ కేసు సూర్యజ్ జీవితం నుంచి పదేళ్లను లాగేసుకుందని, అతని కెరీర్‌ను, మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేసిందని జరీనా వహాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు తన తలపై ఆ భారాన్ని 10 సంవత్సరాలు మోసాడు అని ఆమె అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.