ఏ క్షణమైనా నన్ను చంపేస్తారు.. అతని కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్తా.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య

క్షమాపణలు, కన్నీళ్లు, పశ్చాత్తాపం… మస్తాన్‌ సాయితో తాను పడిన ఆవేదనను టీవీ9 వేదికగా వెల్లడించారు లావణ్య. రాజ్‌ తరుణ్‌తో జీవితం కోల్పోయానని.. ప్రాణభయంతో రోడ్డుపై నిల్చున్నా అంటున్నారు. తనకేం జరిగినా.. మస్తాన్ సాయి, వారి పేరెంట్స్‌దే బాధ్యత అంటున్న లావణ్య. ఆమె ఇన్ని విషయాలు చెప్పారో ఒక్కసారి చూద్దాం.!

ఏ క్షణమైనా నన్ను చంపేస్తారు.. అతని కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్తా.. కన్నీళ్లు పెట్టుకున్న లావణ్య
Lavanya

Updated on: Feb 13, 2025 | 11:35 AM

టీవీ9 ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది లావణ్య.  కన్నీళ్లు పెట్టుకుంది, క్షమాపణలు చెప్పింది, పశ్చాత్తాపం వ్యక్తం చేసింది లావణ్య. అంతే కాదు ప్రతిక్షణం భయంతో బ్రతుకుతున్నా.. అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మస్తాన్ సాయి గురించి మాట్లాడుతూ..  పదుల సంఖ్యలో అమ్మాయిల రికార్డ్ చేశాడు. చాలామంది అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడు. ఏ క్షణం అయినా నన్ను చంపేయొచ్చు. ప్రాణం, మానంతో పోరాడుతున్నా.. సొసైటీ సపోర్ట్ ఉండదని తెలిసి కూడా పోరాటం చేస్తున్నా అని తెలిపింది లావణ్య.

నా జీవితం కోల్పోయాను, నా మనిషిని కోల్పోయా.. రాజ్‌ తరుణ్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలనుకుంటున్నా అని తెలిపింది లావణ్య. నేను ఏ వీడియోలు రిలీజ్ చేయలేదు, నాకు జరిగిన అన్యాయం వేరే అమ్మాయిలకు జరగొద్దనేదే నా తాపత్రయం అంటుంది లావణ్య. అలాగే రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పాలని ఉంది. నేను నా జీవితాన్ని కోల్పోయాను, రాజ్ తరుణ్ నేను చాలా సంతోషంగా ఉండేవాళ్ళాము. మస్తాన్ సాయి వల్లే మా మధ్య గొడవలు జరిగాయి. మస్తాన్ సాయి తో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లావణ్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి