Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raj Tarun: ‘నన్ను క్షమించండి.. చాలా అవమానంగా అనిపించింది’.. హీరోయిన్‏కు సారీ చెప్పిన రాజ్ తరుణ్..

మరోవైపు ఈ హీరో ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి అతడిపై ఛీటింగ్ కేసు పెట్టింది. దీంతో రాజ్ తరుణ్ పేరు మీడియాలో మారు మోగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ హీరో పేరు కనిపిస్తుంది. ఇక ఇటీవల నెల రోజులుగా సైలెంట్ లావణ్య.. మరోసారి రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇంట్లో

Raj Tarun: 'నన్ను క్షమించండి.. చాలా అవమానంగా అనిపించింది'.. హీరోయిన్‏కు సారీ చెప్పిన రాజ్ తరుణ్..
Raj Tarun
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2024 | 9:54 PM

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు కొన్నాళ్లు వార్తలలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన రాజ్ తరుణ్.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస ప్లాప్స్ రావడంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. కానీ ఇటీవల కొన్ని నెలలుగా రాజ్ తరుణ్ వ్యక్తిగత విషయాలతో వార్తలలో నిలుస్తున్నాడు. ఓవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మరోవైపు ఈ హీరో ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి అతడిపై ఛీటింగ్ కేసు పెట్టింది. దీంతో రాజ్ తరుణ్ పేరు మీడియాలో మారు మోగుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ హీరో పేరు కనిపిస్తుంది. ఇక ఇటీవల నెల రోజులుగా సైలెంట్ లావణ్య.. మరోసారి రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇంట్లో ఉన్నాడంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

అంతేకాకుండా రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాపై దొంగతనం కేసు పెట్టింది. మల్వీ ఇంట్లో రాజ్ తరుణ్ ఉన్న విషయం తెలుసుకుని ముంబై వెళ్లి ఆమె ఇంట్లో గొడవ చేసింది. లావణ్య గొడవ చేస్తున్న సమయంలో హీరో రాజ్ తరుణ్ అక్కడే ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలయ్యింది. తాజాగా ఆ సంఘటనపై రాజ్ తరుణ్ పోస్ట్ చేశారు. ముంబైలో జరిగిన ఘటనకు హీరోయిన్ మాల్వీకి క్షమాపణలు చెప్పాడు.

“ముంబయిలో జరిగిన సంఘటనను తలుచుకుంటే చాలా బాధగా ఉంది. అవమానంగా అనిపించింది. ఇలా మీ ఇంటి వద్ద జరిగినందుకు క్షమించండి. అయినప్పటికీ మీతో, మీ స్నేహితులతో కలిసి వినాయక చవితి పండగను ఆస్వాదించాను. అలాగే ఆ గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి” అంటూ మాల్వీ మాల్హోత్రాను ట్యాగ్ చేస్తూ సారీ చెప్పాడు రాజ్ తరుణ్. అలాగే మాల్వీ ఇంట్లో గణేశుడితో దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే సినిమా రేపు (సెప్టెంబర్ 13)న అడియన్స్ ముందుకు రానుంది.

రాజ్ తరుణ్ ట్వీట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.