Rahul Sipligunj: కంటెస్టెంట్ కష్టాలకు కరిగిపోయిన రాహుల్ సిప్లిగంజ్.. లక్షరూపాయలు ఆర్థిక సాయం

|

Jan 02, 2024 | 1:51 PM

తెలంగాణ యాసలో పాట పడాలంటే రాహుల్ సిప్లిగంజ్ పేరే ముందు గుర్తుకు వస్తుంది. ప్రైవేట్ సాంగ్స్ తో కెరీర్ ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్ ఎంత కష్టపడి ఎదిగాడు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేబ్యాక్ సింగర్ గా రాణిస్తున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆలాపించాడు రాహుల్.ఈ సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

Rahul Sipligunj: కంటెస్టెంట్ కష్టాలకు కరిగిపోయిన రాహుల్ సిప్లిగంజ్.. లక్షరూపాయలు ఆర్థిక సాయం
Rahul Sipliganj
Follow us on

రాహుల్ సిప్లిగంజ్ .. తన స్వరంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించే ఈ యంగ్ సింగర్ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరేమో. తెలంగాణ యాసలో పాట పడాలంటే రాహుల్ సిప్లిగంజ్ పేరే ముందు గుర్తుకు వస్తుంది. ప్రైవేట్ సాంగ్స్ తో కెరీర్ ప్రారంభించిన రాహుల్ సిప్లిగంజ్ ఎంత కష్టపడి ఎదిగాడు. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేబ్యాక్ సింగర్ గా రాణిస్తున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆలాపించాడు రాహుల్.ఈ సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. కీరవాణి సంగీత సారథ్యంలో రాహుల్ కాలభైరవతో కలిసి నాటు నాటు సాంగ్ ను ఆలపించాడు. ఆస్కార్ వేదిక పై కూడా ఆ పాటను పాడి అలరించాడు.

ఇక ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ ఓ సింగింగ్ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. గతంలో బిగ్ బాస్ లో పాల్గొని తన గేమ్ తో ఆకట్టుకున్నాడు రాహుల్ ఇక ఇప్పుడు  సింగింగ్ షోకు జడ్జ్ గా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం ఇటీవలే మొదలైంది. తాజాగా ఈ షోకు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఓ సింగర్ కు రాహుల్ ఆర్ధిక సాయం చేయడం చూపించారు.

ఈ సింగింగ్ కాంపిటేషన్ లో పాల్గొన్న ఓ యువకుడి కష్టానికి రాహుల్ కరిగిపోయాడు. ఓ యువకుడు జాబ్ చేయడానికి విశాఖపట్నం వచ్చానని .. పగలు పాట్లు, రాత్రుళ్ళు పాటలు పడుతూ గడిపేస్తున్న.. దీని కోసం మ్యూజిక్ అకాడమీలో కూడా చేరి డెలివరీ బాయ్ గా పని చేసి ఆ డబ్బులతో సంగీతం నేర్చుకుంటున్నా అని తెలిపాడు. దాంతో రాహుల్ కరిగిపోయాడు. నేను కూడా కింది నుంచే వచ్చాను. నేను బార్బర్ గా పని చేశాను.. నాకుతెలుసు ఆ కష్టాలు అని చెప్తూ.. ఆ యువకుడు మ్యూజిక్ నేర్చుకోవడానికి నేను లక్షరూపాయలు ఇస్తాను అని తెలిపాడు రాహుల్. రాహుల్ మంచి మనసుకు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.