అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె

సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు రఘు కుంచె. అలాగే నటుడిగానూ సినిమాల్లో నటించి మెప్పించారు రఘు కుంచె. అలాగే చక్రి అకాల మరణంపై దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న పుకార్లను, నిరాధార ఆరోపణలను తోటి సంగీత దర్శకుడు రఘు కుంచె ఖండించారు.

అదంతా అబద్దం.. చక్రీ చనిపోవడానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన రఘు కుంచె
Raghu Kunche

Updated on: Apr 16, 2026 | 11:18 AM

ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు రఘు కుంచె ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణం, సినీ పరిశ్రమలో తన ప్రయాణం గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. చక్రి గారితో తన బంధం గురించి మాట్లాడుతూ, దర్శకుడు పూరి జగన్నాథ్ తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించారని రఘు కుంచె వివరించారు. పూరి సలహా మేరకే చక్రి తనకు పాటలు పాడే అవకాశం ఇచ్చేవారని తెలిపారు. ఉదాహరణకు, నేనింతే  చిత్రంలోని “ఓ నో నో నో” పాటను చక్రి గారు మొదట కార్తీక్‌తో పాడిద్దాం అనుకున్నప్పటికీ, పూరి జగన్నాథ్ తన గొంతులోని ప్రత్యేకమైన ఎన్రిక్ ఫీల్‌ను గుర్తించి తనకు అవకాశం ఇప్పించారని రఘు గుర్తుచేసుకున్నారు. అలాగే, రవితేజ నటించిన కృష్ణ సినిమాలో “తరత్తా ఎత్తుకుపోతా” పాటను పాడే అవకాశం తనకు చక్రి గారు కల్పించారని, వి.వి.వినాయక్ తన బావ గారు అయినప్పటికీ, ఆ బంధుత్వాన్ని ఎప్పుడూ తన కెరీర్ కోసం వాడుకోలేదని రఘు కుంచె స్పష్టం చేశారు.

వారెవ్వా..! ఏంటి ఈవిడ కమెడియన్ కూతురా.!! స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..

సినీ పరిశ్రమలోని డైనమిక్స్ గురించి మాట్లాడుతూ, కేవలం పరిచయాలు, బంధుత్వాలు కాకుండా ప్రతిభ, అదృష్టం కీలకమని రఘు అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో, సినీ పరిశ్రమలో విజయం 80 శాతం అదృష్టంపై, 20 శాతం ప్రతిభపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. పూరి జగన్నాథ్ దేవుడు చేసిన మనుషులు చిత్రానికి తనను సంగీత దర్శకుడిగా నియమించినప్పుడు, రవితేజ, భోగవల్లి ప్రసాద్ వంటి వారి ఆమోదం తీసుకున్న తర్వాతే నిర్ణయం ప్రకటించారని తెలిపారీ. ఇంటర్వ్యూలో అత్యంత సున్నితమైన అంశం, దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణం గురించి రఘు కుంచె వివరించారు.

Jabardasth: అతను నాకు దేవుడితో సమానం.. చందాలు వసూలు చేసి నా కూతురికి పెళ్లి చేశా

చక్రి మరణంపై అతను విపరీతంగా తాగి చనిపోయాడు అని ప్రచారంలో ఉన్న రూమర్లను ఆయన తీవ్రంగా ఖండించారు. చక్రి అద్భుతమైన వ్యక్తి అని, తన ఆఫీసును చక్రి సత్రంగా మార్చి, నిత్యం 30 నుండి 50 మందికి భోజనాలు పెట్టేవారని, ఎవరినీ ఖాళీ కడుపుతో పంపించేవారు కాదని రఘు తెలిపారు. చక్రి మరణానికి కారణం అధిక మద్యపానం కాదని, ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, ఫుడ్ కంట్రోల్ లేకపోవడం, తీవ్రమైన పని ఒత్తిడి, నిద్రలేమి, ఆఖరికి తీవ్రమైన ఒత్తిడే ఆయన ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణమని రఘు కుంచె స్పష్టం చేశారు. ఆయన చివరి రోజుల్లో శ్వాస సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారని, రెండు అడుగులు వేయడానికే ఆయాసపడేవారని, చికిత్సకు శరీరం సహకరించని పరిస్థితికి చేరుకుందని వివరించారు. చక్రి మంచితనం, ఇతరులకు సమయం కేటాయించడం, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే ఆయన అకాల మరణానికి కారణమై ఉండొచ్చని రఘు ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడి చాలా ప్రమాదకరమని, ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోకూడదని సలహా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

వీడెవడండీ బాబు..! అంత అందమైన అమ్మాయి హాయ్ చెప్తే ఇలా చేశాడు..!! కృతిశెట్టి షాక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us