దక్షిణాది చిత్రపరిశ్రమలో నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకనిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు రాఘవ లారెన్స్. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ స్టార్. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోని స్టార్ హీరో. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్.. నిజ జీవితంలోనూ సూపర్ హీరో అన్న సంగతి తెలిసిందే. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటారు. ఇప్పటికే ఆయన ఫౌండేషన్ ద్వారా పేదలు, రైతులకు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు వికలాంగులు, రైతులు అవసరమైన ట్రాక్టర్స్, త్రీవీలర్స్ అందజేశారు. కష్టాల్లో ఉన్న అభిమానులకు తనవంతూ సాయం చేస్తూ వారికి అండగా నిలుస్తుంటారు.
ఇక ఈరోజు (అక్టోబర్ 29) రాఘవ లారెన్స్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పేద వితంతు మహిళలకు అండగా నిలిచారు. కొంతమంది వితంతు మహిళలకు అండగా నిలిచారు. వారికి కుట్టు మిషన్స్ అందించి వారి కళ్లలో ఆనందం నింపారు. ఆ విధంగా సాయం అందించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు లారెన్స్. ఇది చూసిన నెటిజన్స్ రాఘవ లారెన్స్ మంచి మనసుపై ప్రశంసుల కురిపిస్తున్నారు.
ప్రస్తుతం రాఘవ లారెన్స్ కాల భైరవ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. తెలుగు, తమిళం, హిందీ భాషలలో భారీ ఎత్తున ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వచ్చే నెల నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2025 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
Hi friends and fans, During my Mataram journey many widowed women requested for a stitching machine as it would give them an opportunity to work and fulfill their daily needs. As a new venture for my birthday tomorrow. I provided Tailoring machines to widowed women. I need all… pic.twitter.com/1vHBCcE1GQ
— Raghava Lawrence (@offl_Lawrence) October 28, 2024
ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్ లుక్లో తారక్.. వేరేలెవల్ అంతే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.