రెండు రోజుల క్రితమే సుమారు 150 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నారు ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. పిల్లలకు ఉచిత విద్యను అందించడంతో పాటు వారికయ్యే ఖర్చులన్నింటినీ తానే భరిస్తానంటూ తన లేటెస్ట్ ఆడియో సినిమా ఫంక్షన్ వేదికగా హామీ ఇచ్చారు. తాజాగా లారెన్స్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ దీన పరిస్థితిలో జీవితాన్ని నెట్టుకొస్తోన్న ప్రముఖ తమిళ నిర్మాత వీఏ దురైకు రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. దురై గతంలో సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పితామగన్ (తెలుగులో శివపుత్రుడు) లాంటి సూపర్‌హిట్ సినిమాను నిర్మించారు. రజనీకాంత్, విజయకాంత్, సత్యరాజ్ లతో కూడా ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలు తీశారు. అయితే రజనీకాంత్ తో తీసిన బాబా సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు ప్లాఫ్ కావడంతో పూర్తిగా నష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో దురై ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింది. దీంతో ఆయన గత కొంత కాలంగా చైన్నెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన దీన పరిస్థితిని వివరిస్తూ కొన్ని రోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు దురై. దీనికి స్పందించిన హీరోలు రజనీకాంత్, సూర్య తమ వంతు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే డైరెక్టర్ వెట్రిమారన్ కూడా ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ దురైను ఆదుకోవడానికి ముందుకువచ్చారు.
నిర్మాత పరిస్ధితి గ్రహించిన లారెన్స్ బుధవారం ఆయన వైద్య ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. కాగా లారెన్స్ హీరోగా నటించిన రుద్రన్ (తెలుగులో రుద్రుడు) ఇవాళ థియేటర్లలో విడుదైలంది. కతిరేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. శరత్ కుమార్, నాజర్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమా తర్వాత చంద్రముఖి సీక్వెల్‌లోనూ హీరోగా నటిస్తున్నారు లారెన్స్. వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక పాత్ర పోషించింది. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకురానుంది.
I’m extremely happy to share the news of adopting 150 children and provide them with education as a new venture from rudhran audio launch. I need all your blessings #Serviceisgod ?? pic.twitter.com/lSwns10Grs
— Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..