నా కొడుకుని చూసి గర్వపడుతున్నా: హీరో మాధవన్

| Edited By:

Jul 02, 2019 | 11:06 AM

తమిళ స్టార్ హీరో మాధవన్ తన కొడుకుని చూసి ఎంతో గర్వపడుతున్నాడు. ఎంతటి స్టార్ హీరో అయినా ఒక కొడుకుకి తండ్రే కదా..! అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మాధవన్-సరితల కుమారుడు వేదాంత్ థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో.. 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ పడ్డాడు. మూడో స్థానంలో నిలిచిన వేదాంత్ కాంస్యపతకం అందుకున్నాడు. ఇక రీసెంట్‌గా జాతీయ స్థాయి పోటీలు జ‌ర‌గ‌గా అందులో వేదాంత్ మూడు బంగారు, ఒక వెండి […]

నా కొడుకుని చూసి గర్వపడుతున్నా: హీరో మాధవన్
Follow us on

తమిళ స్టార్ హీరో మాధవన్ తన కొడుకుని చూసి ఎంతో గర్వపడుతున్నాడు. ఎంతటి స్టార్ హీరో అయినా ఒక కొడుకుకి తండ్రే కదా..! అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మాధవన్-సరితల కుమారుడు వేదాంత్ థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో.. 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ పడ్డాడు. మూడో స్థానంలో నిలిచిన వేదాంత్ కాంస్యపతకం అందుకున్నాడు. ఇక రీసెంట్‌గా జాతీయ స్థాయి పోటీలు జ‌ర‌గ‌గా అందులో వేదాంత్ మూడు బంగారు, ఒక వెండి పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ విష‌యాన్ని మాధ‌వ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేస్తూ.. గ‌ర్వంగా ఫీల‌వుతున్నాడు. దేవుని ఆశీర్వాదంతోను, మీ అంద‌రి ఆశీస్సుల‌తోను వేదాంత్ జాతీయ స్థాయి రికార్డ్ సాధించ‌డం సంతోషంగా ఉంద‌ని మాధవన్ పేర్కొన్నాడు. మాధవన్ ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌లో నటిస్తున్నాడు.