పుష్ప.. పుష్పరాజ్ దీనవ్వ తగ్గేదే లే..! పార్ట్ 2 విషయంలో సుకుమార్ చెప్తున్న మాటిదే. అంచనాలకు తగ్గట్లుగానే టీజర్ కూడా కట్ చేసారు లెక్కల మాస్టారు. ఇన్నాళ్లూ పుష్ప 2 ఎలా ఉండబోతుందో అనే ఆసక్తికి ఒక్క టీజర్‌తో సమాధానమిచ్చేసారు సుక్కు. 3 నిమిషాలకు పైగా ఉన్న టీజర్‌లో అల్లు అర్జున్‌కు ఇచ్చిన ఎలివేషన్ ఏకంగా కేజియఫ్‌నే మించిపోయింది. పుష్ప ఎక్కడ..? బతికే ఉన్నాడా.. చచ్చిపోయాడా అంటూ సోషల్ మీడియాలో రెండ్రోజులుగా ఓ రేంజ్‌లో ప్రమోషన్ చేస్తున్నారు మేకర్స్. దీనికి సమాధానం టీజర్‌లో ఇచ్చేసారు. పైగా మొదటి భాగంలో పుష్ప అంటే కేవలం ఓ స్మగ్లర్ మాత్రమే.. కానీ రెండో భాగానికి వచ్చేసరికి జనాల్లో దేవుడైపోయాడు. దీన్నిబట్టి స్మగ్లింగ్‌లో పుష్ప రూలింగ్ ఎలా ఉండబోతుందో అర్థమైపోతుంది.
పుష్ప 2పై ఉన్న అంచనాలను ఒక్కసారిగా డబుల్ చేసింది ఈ టీజర్. ముఖ్యంగా చివర్లో పులి వచ్చినపుడు అల్లు అర్జున్ షాట్ టీజర్ మొత్తానికి హైలైట్. ఇదొక్కటే కాదు.. బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. ఎప్రిల్ 8న ఆయన బర్త్ డే కానుకగా అమ్మవారి గెటప్‌లో ఉన్న లుక్ విడుదల చేయనున్నారు. నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు అల్లు అర్జున్.
ఇప్పటికే పుష్ప 2 మూడు మేజర్ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. సినిమా ఊహించిన దానికంటే చాలా బాగా వస్తుందని ఖుషీగా ఉన్నారు మేకర్స్. సుకుమార్ అయితే ఏ చిన్న విషయంలోనూ రిస్క్ తీసుకోవడం లేదు. టైమ్ తీసుకున్నా పర్లేదు కానీ బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వాలని చూస్తున్నారు. 2024 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నా.. క్వాలిటీ కోసం సినిమా వాయిదా వేయడానికి కూడా రెడీగానే ఉన్నారు దర్శక నిర్మాతలు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.