Puneeth Rajkumar Death: షూటింగ్‌లు ప్యాకప్ చేసి కర్ణాటక బయలుదేరి వెళ్తున్న కన్నడ సినిమా యూనిట్

పునీత్ రాజ్ కుమార్ హతన్మరణం తో హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో కన్నడ సినిమా షూటింగ్ లు అన్ని నిలిపివేశారు.

Puneeth Rajkumar Death: షూటింగ్‌లు ప్యాకప్ చేసి కర్ణాటక బయలుదేరి వెళ్తున్న కన్నడ సినిమా యూనిట్
Puneeth

Updated on: Oct 29, 2021 | 6:59 PM

Puneeth Rajkumar Death: పునీత్ రాజ్ కుమార్ హతన్మరణం తో హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో కన్నడ సినిమా షూటింగ్ లు అన్ని నిలిపివేశారు. తమ అభిమాన హీరో చనిపోవడంతో కన్నడ సినిమా యూనిట్ అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో సినిమా షూటింగ్ లు ప్యాకప్ చేసి కర్ణాటక బయలుదేరి వెళుతున్నారు. ప్రముఖ హీరో ఉపేంద్ర, ఫైట్ మాస్టర్ గణేష్.. హీరోయిన్ నిమిక రత్నాకర్ విషయం తెలిసిన వెంటనే షూటింగ్ మధ్యలో ఆపేసి కర్ణాటక బయలుదేరి వెళ్లారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, ఆయన కొడుకు పునీత్ అంటే తమకు ప్రాణం అని.. చిన్న వయసు నుండి ఎన్నో అవార్డులు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గొప్ప నటుడు పునీత్..అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారికి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ మృతి కన్నడ సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు.

శుక్రవారం ఉదయం తన ఇంట్లో జిమ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక్కసారిగా పునీత్ కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే బెంగుళూరులోని విక్రమ్ హాస్పటల్ కు తరలించారు కుటుంబసభ్యులు. పరిస్థితి విషమించడంతో పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణ వార్త విని కన్నడ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. సినీ ప్రముఖులంతా పునీత్ మరణ వార్త విని షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని కంఠీరవ స్టేడియంకు అభిమానుల సందర్శనార్ధం తరలించారు. రేపు (శనివారం) పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar: గుండెపోటుతోనే మరణించిన పునీత్ తండ్రి.. అతడి సోదరుడికి కూడా గతంలో హార్ట్ ఎటాక్

RRR Movie : “ఆర్ఆర్ఆర్” అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్‌ను వాయిదా వేసిన మేకర్స్.. కారణం ఇదేనా..

Puneeth Rajkumar Death: ఇది చనిపోవాల్సిన వయసు కాదు.. పునీత్ మరణం పై ప్రధాని మోడీ ట్వీట్..