Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ ఎమోషనల్ పోస్ట్.. అది చూసి కళ్లలో నీళ్లు తిరిగాయంటూ..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇంకా కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ ఎమోషనల్ పోస్ట్.. అది చూసి కళ్లలో నీళ్లు తిరిగాయంటూ..
Puneeth Raj Kumar

Updated on: Nov 17, 2021 | 9:36 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో కర్ణాటక చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పు మరణాన్ని ఇంకా కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ తో తమకున్న అనుభవాలను.. జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కన్నీరుమున్నీరవుతున్నాయి. పునీత్ మరణించి రెండు వారాలు ముగుస్తున్న ఆయనకు సంబంధించిన ఫోటోలు.. వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అప్పుతో తమకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికీ పునీత్ సమాధి వద్దకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. మరోవైపు.. తెలుగు, తమిళ్ సినీ ప్రముఖులు పునీత్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న బెంగుళూరులో పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులతోపాటు.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పునీత్ కు కన్నడ రత్న అవార్డు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు పునీత్‏తో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

తాజాగా పునీత్ భార్య అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో లేని అశ్విని.. తాజాగా ఇన్‍స్టాగ్రామ్ లో పునీత్ కోసం నోట్ చేశారు. ” శ్రీ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం మా కుటుంబ సభ్యులకే కాదు.. మొత్తం కర్ణాటక ప్రజలకు షాకింగ్ గా ఉంది. ఆయన్ను పవర్ స్టార్ చేసిన అభిమానులకు పునీత్ లేనిలోటు ఊహించడం కష్టమే. ఈ బాధలో మీరు మనోనిబ్బరం కోల్పోకుండా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలకు తావివ్వకుండా.. గౌరవంగా పునీత్ కు అంతిమ వీడ్కోలు పలికారు. సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. భారతదేశంతోపాటు విదేశాల నుంచి ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు. అప్పును వేలాది మంది ఫాలో అవ్వడం.. ఆయనలా నేత్రదానానికి ముందుకు రావడం మీ మనసులో అప్పుకు ఉన్న స్థానం చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయనను ఆదర్శంగా తీసుకుని మీరు చేసే మంచి పనులలో పునీత్ జీవించి ఉంటారు. ఈ ప్రేమ, మద్దతు కోసం మా కుటుంబం తరుపున అభిమానులకు…ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ” అంటూ భావోద్వేగ నోట్ షేర్ చేశారు.

Also Read:  Major Movie: అడివి శేష్ మేజర్ మ్యూజిక్ రైట్స్ వారికే.. రిలీజ్ ఎప్పుడంటే..

Raviteja: రవితేజ ధమాకా నుంచి మరో అప్డేట్.. మాస్ మాహారాజా సరసన మరో హీరోయిన్..