Puneeth Rajkumar Death: “ఈ వార్త నిజం కాకూడదు”.. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్న సినీప్రముఖులు..

పునీత్‌ మృతి శాండిల్‌వుడ్‌ను షాక్‌కు గురి చేసింది. సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గరయింది. పునీత్‌ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న సినీ పెద్దలు..

Puneeth Rajkumar Death: ఈ వార్త నిజం కాకూడదు.. పునీత్ రాజ్ కుమార్ మృతికి సంతాపం తెలుపుతున్న సినీప్రముఖులు..
Puneeth Raj Kumar 1

Updated on: Oct 29, 2021 | 3:29 PM

Puneeth Rajkumar Death: పునీత్‌ మృతి శాండిల్‌వుడ్‌ను షాక్‌కు గురి చేసింది. సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గరయింది. పునీత్‌ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న సినీ పెద్దలు.. ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డేడ్‌బాడీని బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలించారు.

పునీత్‌ మృతిపై కన్నడ సీని ప్రముఖులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు సినీ పెద్దలు, ప్రముఖులు ట్వీట్‌లు చేశారు. ట్విట్టర్‌ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వలక్షణ నటుడు సోనూసూద్‌, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, హీరో సిద్దార్థ ట్విట్టర్‌లో నివాళులర్పించారు.
మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ న్యూస్‌ తనను షాక్‌కు గురి చేసిందని తెలిపారు. ఆయన మృతికి, కటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని ప్రకటించారు. పునీత్‌ మృతి ఒక్క కన్నడ సినీ పరిశ్రమకే కాదు.. మొత్తం ఇండియన్‌ సినీ పరిశ్రమకే పెద్ద షాక్‌ అని అన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ.. ఈ వార్తను నమ్మలేకపోతున్నాను.. నేను కలిసిన మంచి మనుషుల్లో పునీత్ ఒకరు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. అలాగే పూజాహెగ్డే, జెనీలియా, రామ్ పోతినేని, మంచు విష్ణు, మంచు మనోజ్,హరీష్ శంకర్, సుధీర్ బాబుతోపాటు పలువురు సినీ ప్రముఖులు పునీత్ మృతిపట్ల సంతాపం తెలిపారు.