Kollywood: తమిళ హీరోలకు కోలివుడ్‌ నిర్మాతల మండలి షాక్‌.. రెడ్‌ కార్డ్‌ ఇవ్వాలని నిర్ణయం

|

Jun 19, 2023 | 11:17 AM

వేర్వేరు సినిమాలకు అడ్వాన్స్ తీసుకుని.. డేట్స్‌ సరిగా ఇవ్వలేదని కొంతమంది నిర్మాతలు కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో యాక్షన్ షురూ చేసిన కౌన్సిల్..హీరోలు విశాల్‌, శింబు, అధర్వ, ఎస్‌జే సూర్య, యోగిబాబులకు రెడ్‌ కార్డ్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది

Kollywood: తమిళ హీరోలకు కోలివుడ్‌ నిర్మాతల మండలి షాక్‌.. రెడ్‌ కార్డ్‌ ఇవ్వాలని నిర్ణయం
Kollywood
Follow us on

తమిళ హీరోలకు నిర్మాతల మండలి ఝలక్ ఇచ్చింది. ఐదుగురు హీరోలకు ఏకంగా రెడ్ కార్డ్‌ ఇవ్వాలని డిసైడ్ అయింది. వేర్వేరు సినిమాలకు అడ్వాన్స్ తీసుకుని.. డేట్స్‌ సరిగా ఇవ్వలేదని కొంతమంది నిర్మాతలు కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో యాక్షన్ షురూ చేసిన కౌన్సిల్..హీరోలు విశాల్‌, శింబు, అధర్వ, ఎస్‌జే సూర్య, యోగిబాబులకు రెడ్‌ కార్డ్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నిర్మాతలకు సహకరించని శింబు, విశాల్, ఎస్.జె.సూర్య, అధర్వ, యోగిబాబు అనే ఐదుగురు ప్రముఖ నటులకు రెడ్ కార్డ్ ఇవ్వాలని తమిళ సినీ నిర్మాతల సంఘం నిర్ణయించింది.

శింబు, విశాల్, ఎస్.జె.సూర్య, అథర్వ, యోగిబాబు తదితర ప్రముఖ నటుల సినిమాలకు సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. కొంతమంది నటీనటులు నటీనటుల సంఘం నుండి వివరణ కోరాలని చెప్పారు. నటీనటుల సంఘం ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్య తీసుకోవాలని నిర్ణయించారు

ఈ ఐదుగురు నటులలో, నిర్మాత ఈ సారి గణేష్ సంస్థ నుండి అడ్వాన్స్ తీసుకుని కాల్ షీట్ ఇవ్వని శింబుకి రెడ్ కార్డ్ వేయాలని నిర్ణయించుకుంది. అలాగే నిర్మాత కె.పి. ఫిలింస్ బాలు నుండి అడ్వాన్స్ పేమెంట్ తీసుకుని స్టూడియో గ్రీన్‌కు కాల్షీట్ ఇవ్వని విశాల్‌, అలాగే. ఎస్జె సూర్య,అథర్వపై చర్యలు తీసుకున్నారు. రెడ్ కార్డ్‌ అనేది వార్నింగ్‌ బెల్‌ లాంటిది. డిసిప్లేన్ సరిగా లేకుంటే ఈ కార్డ్‌ వాడుతారు. ఒకవేళ రెడ్‌కార్డ్‌ ఇస్తే హీరోలు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.